జూ ఎన్టీఆర్ చిత్రానికి విదేశీ పాప్ సింగర్?
ప్రస్తుతం భారత్‌లో ఓ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇండియన్ మ్యూజిక్ లవర్స్ అతడంటే పడి చస్తున్నారు. అతనే అకోన్. షారుక్ ఖాన్ రా.వన్ చిత్రంలో 'చమ్మక్ చలో" పాట పాడింది ఇతడే. ఈ పాట దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అతని వాయిస్‌కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో...అతడితో జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'బాద్ షా' చిత్రంలో పాడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ అతనితో పాడించేందుకు అద్భుతమైన ట్యూన్లు రెడీ చేస్తున్నాడని, ఇంగ్లీష్...తెలుగు మిక్సింగ్‍లో ఈ పాట ఉంటుందని.....సినిమాకే హైలెట్ అయ్యేలా ఆ పాట చిత్రీకరణ ఉంటుందని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనే దానిపై ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
శ్రీను వైట్ల దర్వకత్వంలో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటీలీలోని మిలన్‌లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు షూటింగ్ అక్కడే సాగుతుంది. ఆగస్టు మొదటి వారంలో బ్యాంకాక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నాన్ స్టాప్‌గా డిసెంబర్ వరకు జరిగే షూటింగుతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది.
జూనియర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి గోపీమోహన్, కోన వెంకట్ అద్భుతమైన స్క్రిప్టు అందించారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 11, 2013న సంక్రాంతి కానుకగా చాలా గ్రాండ్ లెవల్లో 'బాద్ షా' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











