Allu Arjun: పుష్ప 2లో మెయిన్ సీన్ లీక్.. అసలైన టర్నింగ్ పాయింట్ అదే!
తెలుగు చిత్ర పరిశ్రమలో రూపొందిన కొన్ని సినిమాలు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప ది రైజ్' ఒకటి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దేశం మొత్తాన్ని ఊపు ఊపేసింది. దీంతో కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది.
మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు.

హిట్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప ది రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. అదే సమయంలో ఈ మూవీకి సంబంధించి ఎన్నో కీలకమైన అంశాలు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే.
సాధారణ కూలీ నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో పుష్పరాజ్ పెద్ద డాన్‌గా ఎలా రూల్ చేశాడు అన్న పాయింట్‌తో 'పుష్ప ద రూల్' రూపొందుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్నీ హై రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుందని తాజాగా ఓ న్యూస్ లీక్ అయిపోయింది.
'పుష్ప ది రూల్' ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్ హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఇందులో అల్లు అర్జున్ రిస్కీ షాట్స్ కూడా చేశాడని అంటున్నారు. అలాగే, ఈ ఫైట్ సీన్ ముందు వచ్చే ట్విస్టు మాత్రం కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











