గుంటూరు కారం నుంచి మరో క్రేజీ లీక్.. మరోసారి ‘అతడు’ గుర్తొస్తాడట!
అదిరిపోయే యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీనికితోడు సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు. అయితే, గత చిత్రంతో నిరాశ పరిచిన మహేశ్ బాబు.. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తోన్న సినిమానే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో పొలిటికల్ స్టోరీతో రాబోతుంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండగా.. వాటికి ఏమాత్రం తగ్గకుండా దీన్ని హై రేంజ్‌లోనే తెరకెక్కిస్తున్నారు.

దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఏర్పడడంతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ సజావుగా సాగలేదు. కానీ, ఇప్పుడు మాత్రం చిత్రీకరణ వేగంగా అవుతోంది.
హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఇంటర్వెల్ ఫైట్ గురించి ఓ న్యూస్ రివీల్ అయింది. దీని ప్రకారం.. ఈ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇప్పటి వరకూ మహేశ్ బాబు కెరీర్‌లో చూడని రేంజ్‌లో డిజైన్ చేశారని తెలిసింది.

వాస్తవానికి త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనూ ఓ ఫైట్ క్రేజీగా ఉంటుంది. ఉదాహరణకు 'అతడు' సినిమా పొలం ఫైట్ ఏ మేర ప్రభావాన్ని చూపించిందో తెలిసిందే. ఇప్పుడు 'గుంటూరు కారం' మూవీలో మళ్లీ అలాంటి మ్యాజిక్‌నే క్రియేట్ చేయబోతున్నారట. ఇప్పటికే ఈ ఫైట్‌కు సంబంధించిన షూట్ కూడా పూర్తైందని తెలిసింది. ఇది ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











