NBK109: బాలయ్య మూవీకి లెజెండ్ లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే హిట్టే!
తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే హిట్లను అందుకుంటూ సత్తా చాటుతున్నారు. వారిలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ స్టార్ హీరో ఏకంగా మూడు విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఊపులోనే ఆయన ఇప్పుడు తన 109వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం 1980వ నాటి దశకం కథతో రాబోతున్నట్లు న్యూస్ వైరల్ అయింది. అయితే, ఇటీవల వచ్చిన గ్లింప్స్‌లో బాలయ్య లేటెస్ట్ లుక్‌తో కనిపించారు. దీంతో దీనిపై అంచనాలు పెరగ్గా.. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని రూపొందిస్తున్నారు.

బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ మార్క్ డ్రామాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తవడంతో ఈ సినిమాలోకి ఎన్నో అంశాలు బయటకు వచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో ఫలానా ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని, ఫలానా పాట బాగుంటుందని, ఫలానా ఫైట్ అదిరిపోతుందని ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉండబోతుందని తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి కారణం అప్పుడే బాలయ్య రెండో పాత్ర ఎంట్రీ ఇస్తుందట. ఒకరకంగా ఇది 'లెజెండ్' మూవీని గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్లే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. బాలయ్య హీరోగా బాబీ తీస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూన్ లేదా జూలైలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











