పుష్ప 2లో మెయిన్ హైలైట్ లీక్.. అప్పుడు వచ్చే ట్విస్ట్‌కు మైండ్ బ్లాకే
విలక్షణమైన నటనతో పాటు వైవిధ్యమైన జోనర్లలో సినిమాలు చేస్తూ చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. టాలీవుడ్‌లో బడా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరచుకున్న అతడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులు నమోదు చేసుకుంది.
'పుష్ప ద రైజ్' సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఈ సినిమా రెండో భాగం 'పుష్ప ద రూల్' మూవీపై అంచనాలు ఆకాశమంత నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలన్న పట్టుదలతో మూవీ టీమ్ పని చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో లీక్ అయింది.

'పుష్ప ద రూల్'లో పుష్పరాజ్ గంథపు చెక్కల మాఫియాకు రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఫహాద్‌తో బన్నీ పోరాడే సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుందట. అప్పటి వరకూ ఒకలా సాగిపోతున్న చిత్రాన్ని.. మరోవైపు తిరిగేలా చేస్తుందని తెలిసింది. దీంతో ఈ మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోతోన్నాయి.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వచ్చే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











