చిరంజీవి విశ్వంభర చిత్రంలో ‘అంజి’: ఆ సీన్‌కు సీట్లలో కూర్చోవడం కష్టమే!
అరవై సంవత్సరాల వయసు దాటినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత జోష్‌తో దూసుకుపోతోన్న ఆయన.. ఇప్పటికే చాలా చిత్రాలను అందించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఆయన 'విశ్వంభర' అనే సినిమాలో నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా 'విశ్వంభర'ను చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోంది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీ రేంజ్‌లోనే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని గ్రాండ్‌గా తీస్తున్నారు.

విభిన్నమైన కాన్సెప్టుతో రాబోతున్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన నటీనటులపై కీలకమైన సీన్స్ చిత్రీకరించారు. మొత్తంగా 40 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేశారు.
చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ అంశాలను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సమాచారం ప్రకారం.. ఇందులో ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్ ఒకటి హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలయికలో రాబోతున్న 'విశ్వంభర'లో ఇంటర్వెల్ సమయంలో వచ్చే వీఎఫ్ఎక్స్ సీన్ అదిరిపోయేలా ఉంటుందట. గతంలో 'అంజి' సినిమా క్లైమాక్స్‌లో చూపించినట్లుగా ఇందులో కూడా ఓ స్పెషల్ సీన్‌ను పెడుతున్నారట. ఇది సినిమా మొత్తాన్ని మలుపు తిప్పేలా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రలను చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











