twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూజా హెగ్డేను పడేయడానికి అల్లు అర్జున్ పాట్లు.. లీకైన అసలు మ్యాటర్!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డేను బాగా ఇష్టపడ్డారట. ఇక ఆమెను బుట్టలో వేసుకునేందుకు ఆయన ఓ రేంజ్ పాట్లు పడక తప్పడం లేదట. ఈ విషయంపై సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్, పూజా హెగ్డేతో ప్రేమలో పడటమేంటి? అసలు సంగతి ఏమై ఉంటుందా? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఆ వివరాలు మీ కోసం..

    అల్లు అర్జున్- పూజా హెగ్డే లవ్ ఎపిసోడ్

    అల్లు అర్జున్- పూజా హెగ్డే లవ్ ఎపిసోడ్

    అల్లు అర్జున్- పూజా హెగ్డే ప్రేమాయణం సాగించడం మాట వాస్తవం. కానీ అది నిజ జీవితంలో కాదు.. తమ కొత్త సినిమాలో. సినిమాల్లో లవ్ స్టోరీ అనేది కామనే కదా!. అదే ఇక్కడ జరుగుతోంది. అల్లు అర్జున్ తాజా సినిమా 'అలా.. వైకుంఠపురములో' అల్లు అర్జున్- పూజా హెగ్డే లవ్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

    యూత్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్

    యూత్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్

    డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన మాటలతో అల్లు అర్జున్- పూజా హెగ్డే లవ్ ఎపిసోడ్ డిజైన్ చేశారట. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాల్లో ప్రేమ ముచ్చట్లతో పాటు, కామెడీ టైమింగ్ అదిరిపోనుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆఫీస్ ఎపిసోడ్ యూత్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇవ్వనుందని టాక్ నడుస్తోంది.

    ఆఫీస్‌లో పూజా హెగ్డేతో..

    ఆఫీస్‌లో పూజా హెగ్డేతో..

    ఆఫీస్‌లో పూజా హెగ్డేను ప్రేమలో పడేయడానికి అల్లు అర్జున్ పడే పాట్లు, చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్‌తో పాటు రామకృష్ణ తనదైన శైలిలో కామెడీతో ఆకట్టుకుంటాడని సమాచారం. ఫామిలీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా త్రివిక్రమ్ పర్ఫెక్ట్ స్కెచ్ వేశారని అంటున్నారు.

     ఇద్దరికీ చాలా ముఖ్యం

    ఇద్దరికీ చాలా ముఖ్యం

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికీ చాలా ముఖ్యమైన సినిమా 'అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై
    భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

     అంచనాలు రెట్టింపు చేసేలా..

    అంచనాలు రెట్టింపు చేసేలా..

    ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు రెట్టింపు చేసేలా ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు త్రివిక్రమ్. ఇందులో భాగంగా విడుదల చేసిన 'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ లుక్, సామజవరగమన సాంగ్ భారీ స్పందన తెచ్చుకున్నాయి. దీంతో చిత్రయూనిట్‌తో పాటు బన్నీ అభిమానుల్లో జోష్ రెట్టింపయింది.

    English summary
    Allu Arjun and trivikram new movie shooting success fully going on. This movie will release on January 2020. Now this movie First look poster released and getting huze response from the audience. In this movie Allu Arjun Pooja Hegde love track is highlighted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X