ఇంట్రెస్టింగ్: బాలకృష్ణకు అనుకుంటే మహేష్ బాబు సెట్ అయ్యాడు
సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం కామన్. ఈ నేపథ్యం లోనే అనిల్ రావిపూడి తాజా సినిమాకు బాలకృష్ణ అనుకుంటే.. చివరకు మహేష్ బాబు సెట్ అయ్యాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుకు వినిపించిన కథనే బాలకృష్ణకు ఆయన 100 సినిమా సందర్భంలో వినిపించారట డైరెక్టర్ అనిల్ రావిపూడి.
అప్పట్లో బాలకృష్ణ 100వ సినిమాకోసం 'రామారావు గారు' అనే టైటిల్‌తో పవర్‌ఫుల్ ఐఎఎస్ ఆఫీసర్ సబ్జెక్టును వినిపించాడట అనిల్ రావిపూడి. స్క్రిప్ట్‌కి తన మార్క్ కామెడీ జోడించి బాలయ్య బాబు వద్దకు తీసుకెళ్లగా.. ఆ కథ విని బాలకృష్ణ కూడా ఫిదా అయ్యాడట. అయితే ప్రతిష్ఠాత్మక వందో సినిమా కోసం సీరియస్ సబ్జెక్ట్ కావాలని భావించిన బాలయ్య బాబు చివరకు క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను తన 100 వ సినిమాగా ఎంచుకున్నాడట. దీంతో అదే కథకు కొన్ని మార్పులు చేసిన అనిల్ రావిపూడి మహేశ్ బాబుకి వినిపించాడట. దీనికి మహేష్ వెంటనే ఓకే చెప్పేయడంతో సినిమా పనులు మొదలు పెట్టేశాడట అనిల్.

ఇటీవలే 'ఎఫ్-2' సినిమాతో భారీ విజయాన్నందుకున్న అనిల్ రావిపూడి మహేష్ 26 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ముహూర్త కార్యక్రమాలు కూడా పూర్తిచేశారు. ఈ రకంగా బాలకృష్ణకు అనుకుంటే మహేష్ బాబు సెట్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరూ మహేష్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణంలో దిల్ రాజు, అనిల్ సుంకర లతో పాటు మహేష్ బాబు కూడా భాగమవుతుండటం మరో విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరూ సినిమా నిలువనుంది.


Click it and Unblock the Notifications











