ప్రభాస్‌తో సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మూవీ.. తెరపైకి వచ్చిన ఆసక్తికర వార్త
బాహుబలి సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇటీవలే సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చి మిశ్రమ ఫలితం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రానికి జాన్ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్టుకి సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ప్రభాస్ హీరోగా భారీ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట సైరా నరసింహా రెడ్డి డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ మేరకు పాన్ ఇండియా సబ్జెక్ట్ తో త్వరలోనే ప్రభాస్‌ను కలవాలని డిసైడ్ అయ్యారట. ప్రభాస్ రేంజ్‌కి సరిపోయేలా స్క్రిప్ట్ రెడీ చేసి అతిత్వరలో ఆ ప్రాజెక్ట్ ఒకే చేయించాలని నిర్ణయించుకున్నారట. ఇదే నిజమైతే టాలీవుడ్ చిత్రసీమలో మరో భారీ సినిమా రూపుదిద్దుకోవడం ఖాయమే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి పై రాజమౌళి లాంటి దర్శకులు సైతం ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా నరసింహా రెడ్డి గత రికార్డులను తిరగరాస్తూ ఓ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చిత్ర యూనిట్ సభ్యులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది సైరా. సరిగ్గా ఇలాంటి తరుణంలో సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో సినిమా రానుందనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











