భారీ రేంజ్‌లో 'సైరా' ప్రీ రిలీజ్ వేడుక.. ముఖ్య అతిథులు ఎవరంటే..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరంజీవి తనయుడు రామ్ చరణ్ స్వయంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా నిర్మించారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేస్తుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మెగాస్టార్ కెరీర్లో 151వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో వారి అంచనాను రెట్టింపు చేసేలా భారీ ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తోందట సైరా టీమ్. పైగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించారని సమాచారం. సెప్టెంబర్ మూడో వారంలో హైదరాబాద్ లోనే ఈ వేడుకను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారని తెలిసింది. భారీ ఎత్తున జరగబోయే ఈ వేడుకలో సైరా టీమ్ అంతా సందడి చేయనుందట. దీంతో ఇప్పటినుంచే ఈ ప్రీ రిలీజ్ వేడుకపై సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Intresting News on Sye Raa Narasimha Reddy pre release event

1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న సైరా చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా భారీ రేంజ్‌లో 'సైరా నరసింహ రెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X