'సైరా'లో అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్.. కేవలం వాటికే ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

చిరంజీవి హీరోగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రాబోతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంచలనాలకు నాంది పలికేలా సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి.

ప్రమోషన్స్‌తో బిజీ బిజీ

ప్రమోషన్స్‌తో బిజీ బిజీ

ఫ్యాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో అక్టోబర్ 2వ తేదీన విడుదల కానున్న 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లో తొలిసారి వస్తున్న చరిత్రాక కథాంశం కావడంతో ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని భాషా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్తగా ప్లాన్ వేశారట చిరంజీవి.

అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్..

అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్..

ఈ మేరకు గతంలో ఎన్నడూ చూడని విధంగా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా దగ్గరుండి మరీ వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ పరిశీలిస్తున్నారట. ఈ మేరకు ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం భారీ మొత్తం కేటాయించారట రామ్ చరణ్.

Recommended Video

Sye Raa Narasimha Reddy Total Business || 'సైరా' బంపర్ ఆఫర్ |
కేవలం వాటికే కోసమే ఇన్ని కోట్లా..?

కేవలం వాటికే కోసమే ఇన్ని కోట్లా..?

'సైరా నరసింహా రెడ్డి' కథకు తగ్గట్లే అబ్బురపరిచే విధంగా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలని సూచించిన రామ్ చరణ్.. కేవలం ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమే దాదాపు 60 కోట్ల మేర వెచ్చించారని తెలుస్తోంది. సినిమా మొత్తం బడ్జెట్‌లో ఎక్కువ శాతం డబ్బులు ఇక్కడే వాడేశారట. పోరాట సన్నివేశాల్లో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయని తెలుస్తోంది.

 సరికొత్త ఆలోచన.. అమలు

సరికొత్త ఆలోచన.. అమలు

5 భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చేలా సరికొత్త ఆలోచన చేశారట మేకర్స్. ఈ మేరకు తెలుగులో చిరంజీవి పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ.. హిందీ వెర్షన్‌లో అమితాబ్ బచ్చన్, తమన్నా పాత్రలకు.. తమిళం వెర్షన్‌లో విజయ్ సేతుపతి, నయనతారకు.. అలాగే కన్నడ వెర్షన్‌లో సుదీప్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక మలయాళంలో మాత్రం తెలుగు వెర్షన్ ఎడిటింగ్‌తోనే రిలీజ్ చేయనున్నారని టాక్.

సైరా నరసింహా రెడ్డి సినిమా

సైరా నరసింహా రెడ్డి సినిమా

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X