వాటిపై ఓ కన్నేసిన ఎన్టీఆర్.. RRR పూర్తయిన వెంటనే! ముదిరిన టాక్..

వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ మంచి జోష్‌లో ఉన్న ఎన్టీఆర్.. మరింత వేగం పెంచనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు తన RRR సినిమా షూటింగ్ పూర్తికాగానే ఏం చేయాలనే దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించారని టాక్ బయటకొచ్చింది. ఇంతకీ RRR పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ చేయనుందేంటి? వివరాల్లోకి పోతే..

 వాటిపై కన్నేసిన ఎన్టీఆర్

వాటిపై కన్నేసిన ఎన్టీఆర్

ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటం ప్రేక్షకలోకంలో ఆసక్తి నింపింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై ఇప్పటినుంచే ఓ కన్నేశారట ఎన్టీఆర్.

ఏ మాత్రం విరామం లేకుండా ఎన్టీఆర్

ఏ మాత్రం విరామం లేకుండా ఎన్టీఆర్

RRR సినిమా పూర్తికాగానే ఏ మాత్రం విరామం లేకుండా వరుసగా సినిమాలు చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు తనతో సినిమాలు చేయాలనుకుంటున్న డైరెక్టర్లతో కూడా రెగ్యులర్ టచ్‌లో ఉంటూ సినీ విశేషాలు చర్చిస్తున్నారని టాక్. ఎన్టీఆర్ కోసం ఇప్పటికే ముగ్గురు టాప్ డైరెక్టర్లు కథలు సిద్ధం చేశారట. ఆ ముగ్గురే త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ.

 మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ వెంటనే..

మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ వెంటనే..

RRR పూర్తయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారట. ఈ సినిమా పూర్తిగా త్రివిక్రమ్ స్టైల్లోనే ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుందట. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో రాబోయే ఈ సినిమా హై బడ్జెట్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ దూకుడు

ఎన్టీఆర్ దూకుడు

ఇక ఈ రెండు సినిమాలు ఫినిష్ అయిన తర్వాత కొరటాల శివ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ లోగా చిరంజీవితో కొరటాల శివ తన సినిమా పూర్తిచేసి మరో సినిమాకు కమిట్ కాకుండా ఎన్టీఆర్ కోసం బలమైన కథ సిద్ధం చేస్తారట. అంటే ఈ లెక్కన్న RRR పూర్తికాగానే ఎన్టీఆర్ దూకుడు మామూలుగా ఉండదన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X