అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. నా పేరు సూర్య డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఇటీవలే ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియోతో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'అల.. వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో బన్నీ నటన ఆకట్టుకోనుందట. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, గ్రామీణ యువకుడిగా రెండు విభిన్న పాత్రలు అల్లు అర్జున్ పోషిస్తున్నాడని విషవాసనీయ వర్గాల సమాచారం. బన్నీ ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో సహ ఉద్యోగినిగా పూజాహెగ్డే కనిపిస్తుందని, ఆ ఇద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ సినిమాలో హైలైట్ అవుతుందని ఫిలింనగర్ న్యూస్.

Intresting Update From Allu Arjuns Ala Vaikutapuramlo

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక&హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X