బాలయ్యకి ప్రియురాలు దొరికింది.. పాన్ ఇండియన్ భామనే తెచ్చిన గోపీచంద్ !

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈపాటికి సినిమా రిలీజ్ పనులు ముమ్మరంగా సాగుతుండేవి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిశీలిస్తే

హిట్ కోసం వెయిటింగ్

హిట్ కోసం వెయిటింగ్

2016 సంవత్సరం లో నందమూరి బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ కొట్టారు.. ఆ తర్వాత ఆయన దాదాపు నాలుగైదు సినిమాలు చేసిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. తన తండ్రి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన రెండు సినిమాలు కూడా సరైన స్పందన తెచ్చుకోలేక పోయాయి. చివరికి ఆయన తనకు రెండు హిట్ సినిమాలు అందించిన బోయపాటి తో సినిమా ప్లాన్ చేశారు.

 కలిసొచ్చిన డైరెక్టర్

కలిసొచ్చిన డైరెక్టర్

సింహా, లెజెండ్ లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తెరకెక్కుతున్న అఖండ అనే సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా మీద అ బాలకృష్ణ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానికి కారణం ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తూ ఉండడమే. ముఖ్యంగా బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతూ ఉండడంతో పాటు ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో కూడా ఆయన అఘోరాలా కనిపించడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.

 రెండు విభిన్న పాత్రలు

రెండు విభిన్న పాత్రలు

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జులై నెల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో ఒకటి ఫ్యాక్షన్ లీడర్ పాత్ర కాగా మరొకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు.

 శృతి హాసన్ ఫిక్స్!

శృతి హాసన్ ఫిక్స్!

రెండు పాత్రలు పోషిస్తున్న నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ముందు శ్రుతి హాసన్ ను సంప్రదించగా ఆమె చేయడానికి ఒప్పుకోలేదు అని అన్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు తనకు సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ ఇచ్చిన గోపీచంద్ కోసం ఆమె బాలకృష్ణ సరసన నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. నిజానికి శృతిహాసన్ రీ ఎంట్రీ తర్వాత పిలిచి మొట్టమొదటి ఆఫర్ ఇచ్చి హిట్ సినిమాలో భాగం చేసింది గోపీచంద్ మలినేని. అందుకే ఆయన కోసం ఆమె సినిమా ఒప్పుకుందని అంటున్నారు.

 ఆయన కోసమే

ఆయన కోసమే

అయితే సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న శృతిహాసన్ బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో నటిస్తే ఆమెకు భవిష్యత్తులో అవకాశాలు తగ్గే ఛాన్స్ లేక పోలేదు. అయినా సరే ఈ భామ తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడి కోసం ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయనేది అధికారిక ప్రకటన వెలువడితే కానీ చెప్పలేం. ఇక శృతి హాసన్ సలార్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X