RRRలో ఆలియా క్యారెక్టర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. చాలా కష్టమవుతోందట!
బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో భారీ ప్రాజెక్ట్ 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా అప్‌డేట్స్ కోసం, ఇతరత్రా వివరాల కోసం ప్రేక్షకలోకం ఎంతగానో ఆసక్తి చూపుతోంది. తాజాగా RRRలో ఆలియా క్యారెక్టర్ విషయమై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వినిపిస్తోంది. ఆ వివరాలు చూస్తే..

భారీ ప్రాజెక్ట్ 'RRR'.. హీరోయిన్ సమస్య
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది RRR. దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. అయితే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ ఆలియా భట్ కన్ఫర్మ్ అయింది. రామ్ చరణ్ సరసన ఈమె నటిస్తోంది. అయితే ఎన్టీఆర్ సరసన నటించబోయే మరో హీరోయిన్ సమస్య మాత్రం 'RRR' యూనిట్ ని వెంటాడుతూనే ఉంది.

ఆలియా భట్ క్యారెక్టర్.. ఇదీ టాక్
బాలీవుడ్ భామ ఆలియా భట్ RRR సినిమాతోనే తెలుగు తెరపై అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో ఆమె రోల్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకే ఆలియా ఈ సినిమాలో నటిస్తోంది కానీ, ఇందులో ఆమె పాత్ర ఏమంత ప్రభావితం చేయదు పైగా నిడివి కూడా తక్కువే అని ప్రచారాలు మొదలయ్యాయి.

ఎందుకీ టాక్.. కారణం అదేనా?
ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆలియా.. తనకు రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమాలు చేయాలనేది కల అని పేర్కొంది. RRR సినిమాతో ఆ కల నెరవేరబోతోందని, ఈ సమయంలో నా పాత్ర ఏంటి? లెంగ్త్ ఎంత? అనే విషయాలు పెద్దగా పట్టించుకోనని తెలిపింది. దీంతో దీన్నే ఆసరాగా చేసుకొని RRR లో ఆలియా క్యారెక్టర్ చాలా చిన్నది అనే వార్తలు బయటకు వస్తున్నాయని తెలుస్తోంది.

చాలా కష్టం అనేసింది ఆలియా
ఇక అదే మీడియా సమావేశంలో.. తెలుగు నేర్చుకోవడానికి పడిన కష్టాలను సైతం వివరించిన ఆలియా ఈ భాష నేర్చుకోవడం చాలా కష్టం అనేసింది. అయినప్పటికీ తన పాత్రకు న్యాయం చేయాలంటే తెలుగు ఖచ్చితంగా తెలిసి ఉండాలని, అందుకే తెలుగు నేర్చుకోవటానికి చాలా కష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది ఆలియా.

RRR మూవీ
1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











