బిగ్ బాస్ 3 ఫైనల్లో ముగ్గురు హీరోయిన్ల హంగామా.. చిరంజీవి, నాగార్జునలతో చిందేసేందుకు రెడీ!
బుల్లితెర పాపులారిటీ షో బిగ్ బాస్ తుది అంకానికి చేరుకుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 పేరుతో జులై 21వ తేదీన మొదలైన ఈ షో నవంబర్ 3తో ముగియనుంది. 100 రోజులు 100 కెమెరాలు అంటూ నాగార్జున పలకరింపుకు ముగింపు ముహూర్తం కుదిరింది. నవంబర్ 3వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది.
ఈ నేపథ్యంలో ఈ ఫైనల్ ఎపిసోడ్‌లో గత సీజన్లలో కంటే ఎక్కువ హంగామా చేయాలని ఫిక్స్ అయ్యారట. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్ వేదికను కళలాడించేందుకు హీరోయిన్ల అందాలు స్పెషల్ అట్రాక్షన్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, క్యాథరిన్, అంజలి లను సంప్రదించిందట బిగ్ బాస్ మేనేజ్‌మెంట్. వీళ్ళ కోరిక మేరకు ఆ ముగ్గురు హీరోయిన్స్ బిగ్ బాస్ వేదిక దద్దరిల్లే స్టెప్పులేస్తామని మాటిచ్చారట.

మరోవైపు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నారని టాక్ నడుస్తోంది. చిరంజీవి, నాగార్జున మధ్య ఉన్న సాన్నిహిత్యం మేరకు చిరు ఈ షోకి రావడానికి రెడీ అయిపోయారట. ఇదిలా ఉండగానే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్ల మ్యాటర్ బయటకు వచ్చేసింది. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ ఆదివారం హంగామా మామూలుగా ఉండదేమో అనిపిస్తోంది. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నిధి అగర్వాల్, క్యాథరిన్, అంజలి లాంటి అందగత్తెల చిందులు యమ కిక్ ఇవ్వనున్నాయన్నమాట.


Click it and Unblock the Notifications











