చిరంజీవి 152.. అన్నీ రూమర్లేనట.. వెరీ ఇంట్రెస్టింగ్!
రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ మరోసారి తారాస్థాయికి చేరింది. అయితే ఈ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న చిరు.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ పూర్తికావడంతో ఇక ఆయన తదుపరి సినిమా చిరు 152 పై అందరి దృష్టి పడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథా, కథనాలపై ఓ రేంజ్ లో వార్తలు పుట్టుకొచ్చాయి. ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషిస్తుందని, తండ్రీ కొడుకుగా ఆయనే నటిస్తున్నాడని అన్నారు. ఇక ఈ సినిమా ఈ సినిమాలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండబోతోందని కొందరంటే.. కాదు కాదు క్రీడా నేపథ్యంలో ఉండనుందని మరికొందరు అన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి 152 మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటిదాకా వచ్చనవన్నీ రూమర్స్ అని అంటున్నారు కొందరు. ఈ సినిమాలో చిరు సింగల్ లుక్ లో కనిపిస్తాడని, కొరటాల శివ ఓ సందేశాత్మక అంశాన్ని తీసుకొని కమర్షియల్ కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తాజా సమాచారం. ఇక హీరోయిన్ విషయంలో అయితే నయనతార పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే చిరు 152 సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











