'సైరా నరసింహా రెడ్డి' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. రామ్ చరణ్ స్కెచ్.. మెగా అభిమానులకు పండగే!
Recommended Video
మెగా అభిమానులు పండుగ చేసుకునే ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' గురించి. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటి? అనే కదా మీ సందేహం.. చూడండి మీకే తెలుస్తుంది.

చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ తర్వాత
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 తర్వాత తదుపరి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎట్టకేలకు చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' మొదలు పెట్టి అందరిలోనూ ఆసక్తి నింపారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఆసక్తి రేకెత్తిస్తున్న సైరా లుక్స్, టీజర్
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా 'సైరా నరసింహా రెడ్డి' పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇప్పటికే ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇక ఇటీవలే విడుదలైన సైరా నరసింహా రెడ్డి టీజర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇంతలో 'సైరా' ప్రీ రిలీజ్ వేడుకకు సంబందించిన ఆసక్తికర వార్తలు బయటకొస్తున్నాయి.

గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. లొకేషన్ ఇదే
గతంలో ఎన్నడూ ఏ సినిమాకు చేయని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అత్యంత గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీన ఈ వేడుకను కర్నూలులో నిర్వహించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అతిథులెవరంటే.. రామ్ చరణ్ ప్లాన్
ఇక ఈ మెగా వేడుకకు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, మోహన్ లాల్ ముఖ్యఅతిథిలుగా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. సైరా నరసింహా రెడ్డి తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో అన్ని భాషల్లో అంచనాలు పెరిగేలా ఇలా ప్లాన్ చేశారట రామ్ చరణ్.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి హై రేంజ్‌లో రూపొందించారు. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











