వెంకటేష్ సరసన యంగ్ బ్యూటీ.. 'నారప్ప' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'నారప్ప'. తమిళ మూవీ 'అసురన్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ దగ్గుబాటి అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. తాజాగా నారప్ప హీరోయిన్ గురించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

Recommended Video

Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani | Filmibeat Telugu
తమిళ్ వర్షన్‌ టు తెలుగు వర్షన్‌

తమిళ్ వర్షన్‌ టు తెలుగు వర్షన్‌

తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన 'అసురన్' తెలుగులో వెంకటేష్ హీరోగా 'నారప్ప' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ వర్షన్‌కి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా, తెలుగు వర్షన్‌కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించగా, వెంకటేష్ జంటగా ప్రియమణి నటిస్తోంది.

మరో హీరోయిన్‌కి ఛాన్స్.. సెట్స్ పైకి యంగ్ బ్యూటీ

మరో హీరోయిన్‌కి ఛాన్స్.. సెట్స్ పైకి యంగ్ బ్యూటీ

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెలిసింది. చిత్రంలో ప్రియమణితో పాటు మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందట. ఈ మేరకు రెండో హీరోయిన్‌గా మలయాళ యంగ్ నటి రెబ్బా మోనిక జాన్‌ని తీసుకున్నారని, ఇప్పటికే ఆమె సెట్స్ పైకి కూడా వచ్చేసిందని టాక్ వినిపిస్తోంది.

శరవేగంగా షూటింగ్.. సమ్మర్‌ రిలీజ్

శరవేగంగా షూటింగ్.. సమ్మర్‌ రిలీజ్

ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో నారప్ప షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్ ఈ సమ్మర్‌లో నారప్పని ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నారప్ప నుంచి విడుదలైన వెంకటేష్ లుక్ సినిమాపై భారీ అంచనాలు తెచ్చిపెట్టింది.

వెంకటేష్ 74వ సినిమా.. కెరీర్‌లో మరో మైలురాయి

వెంకటేష్ 74వ సినిమా.. కెరీర్‌లో మరో మైలురాయి

వెంకటేష్ 74వ సినిమాగా 'నారప్ప' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటగానే ఏకంగా నాలుగు ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్స్‌లో వెంకటేష్ గెటప్ గతంలో ఎన్నడూ చూడని విధంగా మరింత డిఫెరెంట్‌గా ఉంది. దీంతో ఈ మూవీ వెంకీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం కనిపిస్తోందంటూ ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 నారప్ప విశేషాలు..

నారప్ప విశేషాలు..

సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు‌లో ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో 'నారప్ప' కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇక చిత్రానికి సినిమాటోగ్రఫీ సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X