మరోసారి బాలకృష్ణ చేతిలో గన్..! తెరపైకి ఆసక్తికర అంశం

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏ గెటప్ వేసినా ఇట్టే సూటయిపోతారు. గత మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న ఆయన సినిమాలతో పాటు రాజీకీయాల్లోనూ కింగే. తండ్రికి తగ్గ వారసుడిగా సినీ, రాజకీయ వర్గాల్లో రాణిస్తున్న బాలకృష్ణ గతంలో చాల సినిమాల్లో గన్ పట్టుకొని ఆడియన్స్ చేత ఈలల గోల పెట్టించారు. ఇప్పుడు మరోసారి దాన్నే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారట బాలయ్య బాబు. ఆ వివరాలేంటో చూద్దామా..!

రాజకీయ నుంచి సినిమాల వైపు

రాజకీయ నుంచి సినిమాల వైపు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన బాలకృష్ణ.. ఆ బిజీ నుంచి కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఈ మేరకు తన తదుపరి సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ 105వ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు బాలకృష్ణ.

తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో

తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో

తమిళ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 105 రూపొందనుంది. ఈ చిత్రానికి బడా నిర్మాత సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అతిత్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇందులో బాలయ్య క్యారెక్టర్ ఏంటనే దానిపై ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.

బాలకృష్ణ చేతిలో గన్

బాలకృష్ణ చేతిలో గన్

బాలకృష్ణ కెరీర్ లో 105 వ సినిమాగా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌తో పాటు గ్యాంగ్ స్ట‌ర్‌గా కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ముందు పోలీస్ ఆఫీసర్‌గా చేతిలో గన్ను పట్టుకొని గడగడలాడించిన బాలయ్య ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడన్నదే ఈ సినిమాలో ఆసక్తికర అంశమని తెలుస్తోంది.

రూలర్ అనుకున్నారు బట్

రూలర్ అనుకున్నారు బట్

ఇక ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే.. ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ పరంగా రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భాస్తున్నారట. మరోవైపు 'క్రాంతి' అనే టైటిల్‌ వైపు బాలకృష్ణ మొగ్గుచూపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా లోని హీరోయిన్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అతి త్వరలో చిత్రానికి సంబందించిన అన్ని వివరాలు ప్రకటించనుంది చిత్ర యూనిట్.

నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ

నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ

బాలకృష్ణ గత సినిమా ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో బాలయ్య 105 పై భారీ హోప్స్ పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమాలో బాలయ్య ఎలాగైనా ఇరగదీస్తాడని మాస్ ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X