టాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ హ్యాండిచ్చినట్లేనా? షాకింగ్ అప్‌డేట్

Recommended Video

Is Jr NTR Going To Ignore Star Director For His Next Movie ? || Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి భారీ బడ్జెట్ మూవీ 'RRR'లో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా కొద్దిరోజులుగా ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ హ్యాండిచ్చాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

 ‘KGF' డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా.. ఊపందుకున్న ప్రచారం

‘KGF' డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా.. ఊపందుకున్న ప్రచారం

ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్' సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో తారక్ తర్వాతి సినిమా ఉంటుందని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తారక్‌ను డ్యాన్సర్‌గా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడని, ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా మైత్రీ మూవీస్ సంస్థకు వినిపించేశాడని వార్తలు వస్తున్నాయి.

ఈ లోగా తెరపైకి త్రివిక్రమ్‌ పేరు

ఈ లోగా తెరపైకి త్రివిక్రమ్‌ పేరు

ప్రశాంత్ నీల్‌, ఎన్టీఆర్ కాంబో మూవీపై ఎలాంటి క్లారిటీ రాకముందే మరో వార్త బయటకు వచ్చింది. అదే.. తారక్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి సినిమా చేయబోతున్నాడని. RRR పూర్తయిన వెంటనే వీరిద్దరి కాం

మరి.. కొరటాల సంగతేంటో!

మరి.. కొరటాల సంగతేంటో!

ఎన్టీఆర్ తదుపరి సినిమాపై వస్తున్న వార్తలు ప్రేక్షకుల్లో కొత్త సందేహానికి తెరలేపాయి. గతంలో RRR పూర్తికాగానే ఎన్టీఆర్.. కొరటాలతో సినిమా చేస్తాడని చెప్పుకున్నారు. ఇందుకు సంబందించిన కథా చర్చలు కూడా జరిగాయని తెలిసింది. ఇంతలో ఇప్పుడు ప్రశాంత్ నీల్‌, త్రివిక్రమ్ పేర్లు వినిపిస్తుండటంతో కొరటాల శివకు ఎన్టీఆర్ హాండిచ్చినట్లేనా? అని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి.

ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తే గానీ..

ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తే గానీ..

RRR తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో ఆయన క్లారిటీ ఇస్తే తప్ప ఇలాంటి పుకార్లను తెరదించడం కష్టం. చూడాలి మరి ఇమ్మడిముమ్మడిగా వస్తున్న ఇలాంటి వార్తలపై ఇకనైనా ఎన్టీఆర్ స్పందిస్తాడా? లేదా? అనేది.

RRR మూవీ..

RRR మూవీ..

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోంది RRR మూవీ. చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X