Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక సిక్స్ ప్యాక్ నాని.. అప్కమింగ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
నాచురల్ స్టార్ నాని సినిమా అంటే చాలు క్లాస్, మాస్ ఆడియన్స్ లో సరికొత్త ఆసక్తి నెలకొంటుంది. డిఫెరెంట్ కథలను ఎంచుకుంటూ గ్యారెంటీ కలెక్షన్స్ దూసుకుపోతుంటాడు నాని. కానీ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ కాస్త డీలాపడిన ఆయన తిరిగి జెర్సీ సినిమాతో పుంజుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో అదే జోష్లో తన కొత్త సినిమాలకు కమిట్ అయ్యాడు నాని.
ఆయన చేస్తున్న తాజా సినిమా 'V'. నాని కెరీర్ లో 25వ సినిమాగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'అష్టాచెమ్మా','జెంటిల్మెన్' సినిమాల తర్వాత నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా.. తాజాగా బయటకొచ్చిన ఓ వార్త నాని అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం నాని సరికొత్తగా మేకోవర్ అయ్యారట. ఇందులో సిక్స్ ప్యాక్ లుక్లో నాని కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నాని విలన్ పాత్ర పోషిస్తున్నాడని, అందుకే 'V' అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.