twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక సిక్స్ ప్యాక్ నాని.. అప్‌కమింగ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    |

    నాచురల్ స్టార్ నాని సినిమా అంటే చాలు క్లాస్, మాస్ ఆడియన్స్ లో సరికొత్త ఆసక్తి నెలకొంటుంది. డిఫెరెంట్ కథలను ఎంచుకుంటూ గ్యారెంటీ కలెక్షన్స్ దూసుకుపోతుంటాడు నాని. కానీ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ కాస్త డీలాపడిన ఆయన తిరిగి జెర్సీ సినిమాతో పుంజుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో అదే జోష్‌లో తన కొత్త సినిమాలకు కమిట్ అయ్యాడు నాని.

    ఆయన చేస్తున్న తాజా సినిమా 'V'. నాని కెరీర్ లో 25వ సినిమాగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'అష్టాచెమ్మా','జెంటిల్మెన్' సినిమాల తర్వాత నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా.. తాజాగా బయటకొచ్చిన ఓ వార్త నాని అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తోంది.

    Intresting Update On Nanis V

    తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం నాని సరికొత్తగా మేకోవర్ అయ్యారట. ఇందులో సిక్స్ ప్యాక్ లుక్‌లో నాని కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నాని విలన్ పాత్ర పోషిస్తున్నాడని, అందుకే 'V' అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Nani's upcoming movie V which is directed by Mohan Krishna Indraganti. On this movie Nani will play a vilam role. And he looks as six pack body.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X