మెగా పండగలా 'సైరా' వేడుకకు సన్నాహాలు.. ముఖ్య అతిథులు ఎవరంటే!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 151వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది సైరా నరసింహా రెడ్డి సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్ గ్రాండ్ గా నిర్వహించి భారీ హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మునుపెన్నడూ ఏ చిత్రానికీ చేయని విధంగా అత్యంత గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పనులు మొదలు పెట్టేశారని తెలుస్తోంది. హైదరాబాదులో జరగనున్న ఈ మెగా వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించడం జరిగింది. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది


Click it and Unblock the Notifications











