విజయ్ దేవరకొండ 'హీరో'.. అలా అనుకుంటే పొరపాటే మరి!

ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ జోష్‌లో ఉన్నాడు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఆయన గత సినిమా డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితం రాబట్టనప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త సినిమాలు శిఘ్ చేశాడు. అందులో ఒకటి 'హీరో'. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ పాత్ర పోషిస్తున్నాడు.

కొంతకాలం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను అర్దాంతరంగా ఆపేసినట్లు వార్తలు వినిపించాయి. డియర్‌ కామ్రేడ్‌ డిజాస్టర్‌ కావటం, హీరో అవుట్‌ పుట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో అంత బడ్జెట్‌ రిస్క్‌ అన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం జరిగింది. కాగా తాజా సమచారం ప్రకారం ఈ సినిమా తిరిగి సెట్స్‌ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. గతంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని బైక్ రేసింగ్స్ సీన్స్ షూట్ చేశారు. ఇక వాటిని కంటిన్యూ చేస్తారని తెలిసింది. సో.. విజయ్ దేవరకొండ 'హీరో' తిరిగి ట్రాక్ ఎక్కబోతున్నాడన్నమాట.

Intresting Update On Vijay Deverakondas hero

స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుందని సమాచారం. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్‌ లో ఇదే ఆమెకు తొలి సినిమా. ఇక విజయ్ వేరే ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటే.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరికొద్ది రోజుల్లోనే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. మొత్తానికైతే ఈ హీరో హవా బాగా నడుస్తోందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X