డాక్టర్ సాయి ధరమ్ తేజ్.. ఆశ్చర్యంగా ఉందా? నిజమే..!

కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. కానీ అసలు విషయం తెలుస్తే అలా ఎందుకనాల్సి వచ్చిందో అర్థమవుతుంది. ఇదే కోణంలో డాక్టర్.. సాయి ధరమ్ తేజ్ అనే పదం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. కాకపోతే అసలు మ్యాటర్ తెలిస్తే అవునా! అనాల్సిందే మరి.

 సాయి ధరమ్ తేజ్ 14.. పవన్ సపోర్ట్

సాయి ధరమ్ తేజ్ 14.. పవన్ సపోర్ట్

సాయి ధరమ్ తేజ్ హీరోగా దవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌లో 14వ సినిమాగా ఈ మూవీ రూపొందనుంది.

పొలిటికల్ డ్రామా..

పొలిటికల్ డ్రామా..

పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాను జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

పోటీషియన్ రమ్యకృష్ణ..

పోటీషియన్ రమ్యకృష్ణ..

ఈ సినిమాలో రమ్యకృష్ణ రోల్ కీలకంగా ఉండనుందట. స్క్రిప్ట్ ప్రకారం ఆమె పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్రలో రమ్యకృష్ణ నట విశ్వరూపం చూడనున్నామని టాక్. రమ్యకృష్ణ, సాయి ధరమ్ తేజ్ మధ్యన వచ్చే కొన్ని సన్నివేశాలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటాయని సమాచారం.

Recommended Video

Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
 డాక్టర్ సాయి ధరమ్ తేజ్.. ఇన్‌సైడ్ టాక్

డాక్టర్ సాయి ధరమ్ తేజ్.. ఇన్‌సైడ్ టాక్

ఇకపోతే ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్.. డాక్టర్‌గా కనిపించనున్నారని ఇన్‌సైడ్ టాక్. లుక్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ ఆకట్టుకోనున్నారని తెలుస్తోంది. ఏలూరు నేపధ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ లో 27 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. కరోనా ఎఫెక్ట్ తగ్గిపోగానే ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X