పవన్‌తో.. ఐపీఎల్ హాట్ లేడీ ఐటం సాంగ్!

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించి ఓ హాట్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఐపీఎల్ హాట్ యాంకర్ రాచెల్లే మరియా రావుతో ఐటం సాంగు చేయిస్తున్నారట.

తన అందచందాలతో యూత్ మతి పోగొడుతున్న ఈ చెన్నై మోడల్....2012లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం దక్కించుకుంది. పవన్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. గబ్బర్ సింగ్ 2 చిత్రంలో మసాలా ఐటం సాంగులో అందాల విందు చేయడానికి ఒప్పుకుందని సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడనుంది.

గబ్బర్ సింగ్ చిత్రం హిందీ మూవీ 'దబాంగ్'కు రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అయితే 'గబ్బర్ సింగ్-2' చిత్రం 'దబాంగ్-2'కి రీమేక్‌గా కాకుండా కొత్త కథతో రూపొందించాలని చూస్తున్నారట. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మారర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత 'గబ్బర్ సింగ్-2' చిత్రం ఫ్లోర్ మీదకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X