‘ఆచార్య’ అప్‌డేట్: మెగా సర్‌ప్రైజ్ రెడీ.. ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'ఆచార్య' అప్‌డేట్స్ కోసం మెగా అభిమానలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న చిత్రయూనిట్ ఈ గ్యాప్‌లో మెగా సర్‌ప్రైజ్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసేందుకు ఓ డేట్ ఫిక్స్ చేసి అందుకు ప్రిపేర్ అవుతున్నట్లు టాక్.
చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఆచార్య' మూవీ. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా..
బ్యూటీ రెజీనా ఓ స్పెషల్ సాంగ్‌లో దర్శనమీయనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కరోనా విజృంభణ నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది.

కాగా సమాచారం మేరకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారట కొరటాల. ముందుగా ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని భావించారు కానీ.. అదే రోజు చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం, రామ్ చరణ్ RRR మోషన్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా మరికొన్ని రోజులు ఆగమని అన్నారట మెగాస్టార్.
ఈ మేరకు ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా మెగాస్టార్ 'ఆచార్య' ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా డిసైడ్ అయ్యారట. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో రూపొంతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











