ప్రభాస్ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్.. ఆల్ మోస్ట్ సెట్టయిన సమయంలో డెత్ న్యూస్!
ప్రముఖ దిగ్గజ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి బాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. బాలీవుడ్ హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ కి దగ్గరైన ఇర్ఫాన్ మరణం చిత్ర పరిశ్రమలకు తీరని లోటనే చెప్పాలి. అయితే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యే ముందు రోజు వరకు చాలా సినిమా కథలు విన్నారట.
Recommended Video

ఇంట్లోనే ఉంటూ..
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడంతో ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకున్న ఇర్ఫాన్ అలాగే కొత్త తరహా కథల గురించి కూడా విన్నాడట. దాదాపు మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఆయన చివరి సినిమా అంగ్రేజి మీడియం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ ని అంధించడంతో అదే యూనిట్ తో మరో సినిమా చేయాలని అనుకున్నారు.

తెలుగులో కూడా..
బాహుబలి అనంతరం చాలా ఇంటర్వ్యూలలో ఇర్ఫాన్ ఖాన్ తెలుగు సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడారు. మంచి కథలు వస్తే ఎలాంటి రోల్స్ అయినా చేస్తానని అన్నారు. గతంలో ఇర్ఫాన్ ఖాన్.. మహేష్ బాబు సైనికుడు సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ మరో సినిమా చేయలేదు.

ఎందుకు చేయలేదంటే..
హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇర్ఫాన్ ఖాన్ తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న సమయంలో టాలీవుడ్ సినిమాలలో కూడా నటించాలని గత కొన్నేళ్లుగా అనుకున్నారట. మధ్య మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ నచ్చక వదిలేశారట. ఇక మరికొన్నిటిని డేట్స్ అడ్జస్ట్ చేయలేక వధులుకోవాల్సి వచ్చిందని గత ఏడాది ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రభాస్ సినిమా కోసం...
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో డిజైన్ చేస్తుండడంతో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక ఇర్ఫాన్ ఖాన్ ని కూడా ఒక పాత్ర కోసం సంప్రదించారట. ఆయన మేనేజర్ తో కూడా వైజయంతి మూవీస్ నుంచి కాల్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆయనతో మాట్లాడాలని అనుకున్న సమయంలో ఆరోగ్యం విషమించిందట. ఆ పాత్ర గురించి వింటే ఆయన తప్పకుండా ఒప్పుకునేవారట.

జస్ట్ మిస్..
ఆల్ మోస్ట్ సెట్టయిన సమయంలో ఇర్ఫాన్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. అయినప్పటికీ ఆయన కోలుకున్న తరువాత మాట్లాడాలని దర్శకుడు ఆలోచించాడు. లాక్ డౌన్ లోపు ఆయన కొలుకుంటే స్టోరీ చెప్పి సినిమాను కూడా స్టార్ట్ చేయాలని ఒక నమ్మకంతో ఉన్నారట. కానీ ఇంతలోనే ఆయన మరణవార్త వైజయంతి టీమ్ ని కూడా షాక్ కి గురి చేసింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











