52 ఏళ్ల గబ్బర్ సింగ్ భామ డేటింగ్ రచ్చ.. 31 ఏళ్ల టెలివిజన్ యాక్టర్‌తో రొమాన్స్?
బాలీవుడ్ నటి మలైకా అరోరా మరోసారి డేటింగ్ వ్యవహారం మీడియాలో రచ్చ చేస్తున్నది. తనకంటే చాలా తక్కువ వయసు ఉన్న యువకుడు, టెలివిజన్ యాక్టర్‌తో రొమాన్స్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో గుప్పు మంటున్నది. అయితే గతంలో కూడా మలైకా అరోరా గురించి పలువురు నటులతో అఫైర్ వార్తలు గుప్పమన్నాయి. అంతేకాకుండా ఎవరితోనైనా చనువుగా కనిపిస్తే చాలూ ఆమెపై రూమర్లు జోరుగా షికారు చేస్తుంటాయి. 52 సంవత్సరాల మలైకా అరోరా గురించిన తాజా డేటింగ్ వ్యవహారం వాస్తవమేనా? లేదా ఏదైనా గాసిపా? అనే వివరాల్లోకి వెళితే..
దిల్‌సే చిత్రంలో ఛయ్య ఛయ్యా పాటతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన మలైకా అరోరా బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించింది. యాక్టర్‌గా కంటే గ్లామర్ తారగా పాపులారిటీని సంపాదించింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌లో లెజెండరీ ఫ్యామిలీ సల్మాన్ ఇంటికి కోడలిగా వెళ్లింది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారికి ఓ కుమారుడు కూడా సంతానంగా ఉన్నారు.

అయితే అర్భాజ్ ఖాన్‌తో దాంపత్యపరమైన విభేదాల కారణంగా మలైకా అరోరా విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత బోనికపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో దాదాపు రెండేళ్లకుపైగా సహజీవనం చేసింది. అయితే పెళ్లి వార్తలు జోరందుకోగానే అనూహ్యంగా వారిద్దరి రిలేషన్‌షిప్ బ్రేక్ అయింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే ఇటీవల హిందీ టీవీ నటుడు సోరాబ్ బేడీతో సన్నిహితంగా ఉండటం, ఆయనతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటంతో మళ్లీ మలైకాపై రూమర్లు గుప్పుమన్నాయి. 31 ఏళ్ల టీవీ నటుడితో రొమాన్స్ ఏమిటి? 52 ఏళ్ల మలైకాలో ఇంకా డేటింగ్ జోష్ తగ్గలేదా? అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. వారిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి కథకథలుగా కామెంట్స్ చేశారు.
అయితే తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై మలైకా ఘాటుగా స్పందించారు.ఇలాంటి వార్తలు చూసిన నా కొడుకు నేను నవ్వుకొంటాం. కొన్నిసార్లు ఇలాంటి వార్తలు నాకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కొన్నిసార్లు వాటిని జోక్స్‌గా తీసుకొంటాను. నా కొడుకు అర్హాన్‌తో పంచుకొని లైట్ తీసుకొంటాను అని మలైకా అరోరా చెప్పారు.
లైఫ్‌లో కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా ఏర్పడుతాయో చెప్పలేం. వాటిని మనం ప్లాన్ చేయలేం. ఒకవేళ జరిగితే వాటిని స్వాగతించాలి. కానీ ప్రస్తుతం అలాంటి వ్యవహారాలు లేవు. నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. తోడు, పార్ట్‌నర్ లాంటి విషయాలు వినడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి బంధం గురించి ఆలోచించడం లేదు అని మలైకా అంది.
మలైకా అరోరా హిందీ నటి అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. మహేష్ బాబుతో కలిసి అతిథి చిత్రంలో నటించింది. అలాగే పవన్ కల్యాణ్‌తో కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే పాటలో గ్లామర్ పంట పండించిన విషయం తెలిసిందే. సోరాబ్ బేడీ విషయానికి వస్తే.. మోడల్‌గా, టీవీ రంగంలో రాణిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











