Pushpa 2 జైలు నుంచి పుష్ప షూటింగ్‌లో జగదీష్.. గుట్టు చప్పుడు కాకుండా బెయిల్‌పై!

పుష్ప మూవీలో అల్లు అర్జున్‌కు స్నేహితుడిగా నటించిన కేశవ పాత్రధారి జగదీష్ మాజీ ప్రియురాలి ఆత్మహత్య కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపింది. అయితే ఆయన అరెస్ట్‌తో పుష్ప షూటింగ్‌కు ఆటంకం ఏర్పడుతుందనే ఊహగానాలు కొనసాగాయి. ఆ క్రమంలో జగదీష్‌ను బెయిల్‌పై విడిపించేందుకు పుష్ప యూనిట్ ప్రయత్నిస్తున్నారనే విషయం మీడియాలో కనిపించింది. అయితే తాజాగా బెయిల్‌పై విడుదలైన జగదీష్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గతంలో ఓ జూనియర్ ఆర్టిస్టుతో రిలేషన్‌షిప్‌లో ఉన్న జగదీష్ ఆ తర్వాత వివాహం చేసుకొని ఆమెకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే జూనియర్ ఆర్టిస్ట్ మరొకరితో రిలేషన్ పెట్టుకోవడం జగదీష్‌కు నచ్చలేదు. ఆమెతో పలుమార్లు గొడవపడిన తర్వాత తన తాజా ప్రియుడితో ఆమె ఉన్నప్పుడు జగదీష్ దొంగచాటుగా వీడియోలు, ఫోటోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేశాడనే విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక జూనియర్ ఆర్టిస్టు సూసైడ్ చేసుకొన్నది అనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు.

 Is Actor Jagadish in Allu Arjuns Pushpa 2 Shoot after bail in Jr Actress Suicide Case?

అయితే ఆమె సూసైడ్ ఘటనపై పోలీసులకు అనుమానం రావడం.. ఆ తర్వాత విచారణలో జగదీష్ పేరు బయటకు రావడం జరిగింది. దాంతో విచారణ నిమిత్తం ఆయనను అదుపులోకి విచారించగా.. తన నేరాన్ని ఒప్పుకొన్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఆయనను రిమాండ్‌కు తరలించడం మరింత సెన్సేషన్‌గా మారింది.

ఇదిలా ఉండగా, జగదీష్ గుట్టు చప్పుడు కాకుండా బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పుష్ప టీమ్ ఆయనతో అల్లు అర్జున్‌కు ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జగదీష్ రోల్‌కు సంబంధించిన కాంబినేషన్ సీన్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు అని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతున్నది. అయితే జగదీష్ బెయిల్‌పై వచ్చిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడం అనేక సందేహాలకు తావిచ్చింది.

 Is Actor Jagadish in Allu Arjuns Pushpa 2 Shoot after bail in Jr Actress Suicide Case?

అయితే జగదీష్‌కు సంబంధించిన పలు సీన్లను ఇప్పటికే పూర్తి చేశారు. నిర్విరామంగా ఆ షూటింగులో జగదీష్ పాల్గొంటున్నాడు. కండిషన్ బెయిల్‌పై వచ్చిన ఆయన పార్ట్‌ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూట్ రామోజీ ఫిలిం స్టూడియోలో జరుగుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X