twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ అంజలి పెళ్లి వార్త వైరల్.. ప్రియుడితోనే అంటూ..

    |

    తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా కొనసాగుతున్న యువ తార అంజలి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదట. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న అంజలి పలువురు హీరోలతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ప్రస్తుతం తమిళ హీరో జైతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అంజలి పెళ్లికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇటీవల తమిళ మీడియాతో మాట్లాడుతూ వివాహంపై క్లారిటీ ఇచ్చేసింది. ఆమె ఏమన్నారంటే..

    తమిళ మీడియాలో పెళ్లి వార్త వైరల్

    తమిళ మీడియాలో పెళ్లి వార్త వైరల్

    తమిళంలో వరుస చిత్రాలతో దుమ్మురేపుతున్న కాస్త నాజుకుగా తయారైంది. నాడిడిగోల్2, గీతాంజలి సీక్వెల్, లీసా చిత్రాల్లో నటిస్తున్నది. తెలుగులో రాయ్ లక్ష్మీతో కలిసి మరో చిత్రంలో నటించాల్సి ఉంది. ఇలా చేతినిండా సినిమాలతో ముందుకెళ్తున్న ఈ మెరుపుతీగ పెళ్లి వార్త తమిళ మీడియాలో భగ్గుమంటున్నది.

    పెళ్లిపై ఆసక్తి లేదు

    పెళ్లిపై ఆసక్తి లేదు

    ప్రస్తుతం హీరో జైతో డేటింగ్ చేస్తున్న నేపథ్యంలో పెళ్లి వార్తలు ఊపందుకొన్నాయి. జైతో తన రిలేషన్‌పై ఎన్నోసార్లు బహిరంగంగానే వెల్లడించింది. తమిళ మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ.. పెళ్లి ఇప్పుడిప్పుడే చేసుకొనే ఆలోచనలు లేవు. అలాంటి ప్రస్తావన ఉంటే తప్పకుండా మీడియాకు వెల్లడిస్తాను అని ప్రశ్నను దాటవేసింది.

     పెళ్లి తర్వాత కూడా పరిశ్రమలోనే

    పెళ్లి తర్వాత కూడా పరిశ్రమలోనే

    ఒకవేళ పెళ్లి జరిగిన నటనకు స్వస్తి చెప్పే ఉద్దేశం లేదు. పెళ్లి తర్వాత కూడా సినీ పరిశ్రమలో కొనసాగుతాను. పెళ్లి, కెరీర్‌కు ఎలాంటి అడ్డంకి లేదని ఇప్పటికే పలువురు హీరోయిన్లు రుజువు చేశారు. తాను కూడా సినియర్ హీరోయిన్లను ఫాలో అవుతానని చెప్పినట్టు మీడియాలో కథనం వెలువడింది.

    తమిళంలో బిజీ హీరోయిన్‌గా

    తమిళంలో బిజీ హీరోయిన్‌గా

    అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళంలోనే క్రేజీ హీరోయిన్‌గా స్థానాన్ని సంపాదించుకొన్నది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి చిత్రాలు మంచి పేరు సంపాదించిపెట్టాయి. ఆ తర్వాత తెలుగులో సినిమాలు అంతగా ఆడకపోవడంతో తమిళ పరిశ్రమనే నమ్ముకున్నది.

    English summary
    Actress Anjali maintaining relation with Tamil Hero Jai. Reports suggest that These hot stars are going to tie the knot very soon. In this occassion, She gave clarity on her marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X