Nayanatara బికినీలో నయనతార.. 16 ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం.. దీపికను మించి గ్లామర్ ట్రీట్
దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్రతారగా నయనతార ఉన్న క్రేజ్‌లో అంతా ఇంతా కాదు.. టాప్ హీరోలకు ఉన్నంత క్రేజ్, బాక్సాఫీస్ స్టామినాతో కెరీర్‌ను ముందుకు సాగుతున్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో నయనతార కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ పోతున్నది. ఇక తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయేందుకు రెడీ అవుతున్నది. అయితే నయనతార బికినీలో కనిపించడమే కాకుండా గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారనే వార్త అభిమానుల్లో జోష్ పెంచింది. నయనతార బాలీవుడ్ ఎంట్రీ గురించి, ఏ హీరో పక్కన బికినీ వేస్తున్నదనే విషయంలోకి వెళితే..

2007లో బికినీలో నయనతార..
నయనతార విషయానికి వస్తే.. 2007 సంవత్సరంలో ఆమె అజిత్ నటించిన బిల్లా సినిమాలో గ్లామర్ హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో గ్లామర్ తారగా అందాల ఆరబోతతో కట్టిపడేసింది. నటిగా ఎదిగిన క్రమంలో, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత హుందా పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నది. అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది.

16 ఏళ్ల తర్వాత జవాన్ మూవీలో
నయనతార ప్రస్తుతం జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నది. అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నది. అయితే ఈ సినిమాలో బికినీలో దర్శనం ఇవ్వబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే తొలుత బికినీలో కనిపించడానికి నిరాకరించిన నయనతార.. టీమ్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకొన్నట్టు సమాచారం. దాంతో 16 ఏళ్ల తర్వాత నయనతార బికినీలో కనిపించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

దీపిక పదుకోన్ తర్వాత బికినీలో
షారుక్ ఖాన్ సినిమాల్లో దాదాపు హీరోయిన్లు బికినీలో కనిపించడం సర్వసాధారణంగా మారిందనేది టాక్. ఇటీవల వచ్చిన పఠాన్ చిత్రంలో దీపిక పదుకోన్ బికినీలో కనిపించి కనువిందు చేసింది. అయితే కాషాయపు రంగు బికినీ ధరించడం భారీ వివాదానికి దారి తీసింది. దీపిక పదుకొన్ బికినీ వ్యవహారం అప్పట్లో భారీ చర్చకు దారి తీసింది.

నెటిజన్ల కామెంట్ ఏమిటంటే?
అయితే బికినీలో నయనతార నటిస్తున్నారనే విషయాన్ని నెటిజన్లు కొట్టిపడేస్తున్నారు. ఆమె బికినీలో కనిపిస్తున్నారనేది మేము నమ్మడం లేదు. బికినీలో కనిపించడం ఆమెకు అవసరం లేదు. కాకపోతే గ్లామర్‌గా కనిపిస్తే తప్పేమీ లేదు అనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

జవాన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రం తెరకెక్కుతున్నది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు భారీ క్రేజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తారని అట్లీ వెల్లడించారు. ఈ సినిమా జూన్ 2వ తేదీన రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్నది. అయితే జవాన్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











