ప్రభుదేవాతో పెళ్లి వరకు? ఆ హీరోయిన్ కెరీర్ నాశనం .. ఆ కారణంగా ఇండియాకు దూరంగా!

సినిమాల్లో అడుగుపెట్టి ఓ వెలుగు వెలగాలని ఎంతోమంది అమ్మాయిలు కలలుగంటారు. కానీ వాటిని నేరవేర్చుకునేది కొందరే. ఇక్కడ గెలవాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. లేదంటే మనం వచ్చింది , వెళ్లింది కూడా ఎవరికీ గుర్తుండదు. అందం, అభినయం బాగున్నప్పటికీ ఫేడవుట్ అయిపోయిన తారలు ఎందరో. ఈ కోవకే వస్తారు అందాల ముద్దుగుమ్మ నికేషా పటేల్.

భారత్ నుంచి యూకే వలస వెళ్లిన గుజరాతీ ఫ్యామిలీలో జన్మించారు నికేషా పటేల్. చిన్న వయసులోనే మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఆమె మిస్ ఇండియా యూకే కిరీటాన్ని అందుకున్నారు. 15 ఏళ్ల వయసులోనే ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీలో పలు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసింది. నటనపై ఆసక్తితో యూకేను వీడి చలో ముంబై అనేసింది. అలా బాలీవుడ్‌లో ఓ సినిమాలో ఛాన్స్ అందుకుంది నికేషా. కానీ ఆ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది.

Is Actress Nikesha Patel marrying star choreographer Prabhu Deva

ఇలాంటి దశలో తొలి సినిమాకే ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ పక్కన హీరోయిన్‌గా అవకాశం వస్తే ఏ అమ్మాయికైనా అంతకుమించిన అదృష్టం ఏముంటుంది. అలా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులిలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు నికేషా పటేల్. ఈ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడే ఈమెకు భారీ పబ్లిసిటీ, క్రేజ్ వచ్చింది. పవన్ మూవీ హిట్ అయితే తాను ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతానని ఆమె భావించారు. కానీ ఆమె ఆశలు అడియాసలు చేస్తూ కొమరం పులి డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ దెబ్బతో కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్ చేసిన నికేషా.. అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత 2013లో ఓం త్రీడి, 2016లో అరకు రోడ్‌లో, 2017లో గుంటూరు టాకీస్ సినిమాల్లో నటించింది. తమిళ్‌లోనూ పలు క్రేజ్ ప్రాజెక్ట్‌ల్లో అవకాశం దక్కించుకుంది. కానీ తర్వాత నికేషా పటేల్‌ను పట్టించుకునేవారే కరువయ్యారు. 2019లో చివరిసారిగా మార్కెట్ రాజా ఎంబీబీఎస్ అనే తమిళ్ చిత్రంలో ఆమె కనిపించారు. తమిళ్‌‌లోనే ఆరియం జన్మంగళ్ అనే సినిమా సెట్స్‌ పైకి వెళ్లగా ఈ మూవీ రిలీజ్ కాలేదు.

Is Actress Nikesha Patel marrying star choreographer Prabhu Deva

అవకాశాలు రాకపోవడంతో ఇక పూర్తిగా సినీ రంగానికి దూరమయ్యారు నికేషా పటేల్. భారత్‌ను వీడి తన కుటుంబంతో కలిసి యూకేలోనే ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఇలా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అయితే ఓ స్టార్ కొరియోగ్రాఫర్‌ను ఆమె ఇష్టపడ్డారని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని, ప్రేమ విఫలం కావడంతోనే ఆమె సినిమాలకు దూరమయ్యారని వార్తలు వచ్చాయి.

ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు.. ప్రభుదేవా. నటుడిగా, డ్యాన్సర్‌గా ప్రభుదేవా అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుదేవాను నికేషా పటేల్ పెళ్లాడబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నికేషా ఈ వ్యాఖ్యలను ఖండించారు. తన వ్యక్తిగత జీవితం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయని వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రభుదేవా తనకు మంచి మిత్రుడు మాత్రమేనని.. ఆయను సార్ అని పిలుస్తానని తేల్చిచెప్పింది. ఎప్పుడో 2018లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: nikesha patel prabhu deva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X