Ramya Krishna: రమ్యకృష్ణను వేశ్యగా మారుస్తున్న యంగ్ హీరో.. ఆ మూవీలో మరోసారి ఇంటెన్స్ రోల్!
ఇప్పుడు ఉన్న రోజుల్లో మంచి బోల్డ్ సినిమాలు అలాగే ఇంకొన్ని బోల్డ్ పాత్రలు అనేవి చాలా కామన్ గా కనిపిస్తూ వస్తున్నాయి. ఇలా తెలుగు నుంచి అర్జున్ రెడ్డి సినిమాతో మొదలైన ఈ ఫీవర్ ఇప్పటికీ కొనసాగుగుంది అని చెప్పవచ్చు. ఈ అంశం కొంచెం పక్కన పెడితే తెలుగు సినిమా సహా తమిళ సినిమాలో చూసుకుంటే కొన్నాళ్ల కితం వరకు ఒక పవర్ఫుల్ హీరో పాత్రని ఢీ కొట్టాలంటే అంతే పవర్ఫుల్ విలన్ కూడా ఉండాలి అనే నానుడిని బ్రేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది నటి రమ్యకృష్ణ అని చెప్పవచ్చు.
తలైవర్ రజినీకాంత్ ని సైతం తలదన్నే స్క్రీన్ ప్రెజెన్స్ తో రమ్యకృష్ణ సంచలనం సెట్ చేశారు. కాగా అక్కడ నుంచి రమ్యకృష్ణ చాలా సినిమాల్లో గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా నెగిటివ్ పాత్రలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఇలా కొన్నేళ్ల పాటు తన హవా సాగింది కానీ ప్రతీ దానికి కొంచెం లిమిట్ ఉంటుంది. అలా కొన్నాళ్ళకి రమ్యకృష్ణ హవా తగ్గింది మిగతా చాలామంది లైన్ లోకి వచ్చేసారు.

అప్పుడు వచ్చింది రమ్యకృష్ణకి బాహుబలి అనే సినిమా. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యిన ఈ రెండు సినిమాల్లో ఆమె నటన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. శివగామి అనే పాత్రకి ప్రాణం పోసిన రమ్యకృష్ణ మళ్ళీ ఫామ్ లోకి రావడం జరిగింది. కానీ ఆమె పొటెన్షియల్ కి తగ్గ పాత్రలు మళ్ళీ తగ్గుతూ వచ్చాయి.
ఆ తర్వాత మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాలో కూడా ఒక క్రూరమైన పొలిటిషన్ పాత్రలో ఆమె మళ్ళీ మెప్పించారు. అయితే నటన పరంగా హీరోయిన్స్ కొన్ని పాత్రలకే పరిమితం అనుకునే మిత్ ని బ్రేక్ చేసిన రమ్యకృష్ణ ఇపుడు మరో డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారా అనిపిస్తుంది. కాగా రమ్యకృష్ణ ఇది వరకు ఏ హీరోయిన్ గాని నటి గాని తీసుకోని స్టెప్ ని నాచురల్ స్టార్ నాని సినిమా కోసం చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇది వరకే రమ్యకృష్ణ పేరు ది ప్యారడైజ్ లో నానికి తల్లి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. కానీ ఇపుడు ఊహించని ప్రశ్న ఏమిటంటే ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషిస్తున్న పాత్ర.. ప్యారడైజ్ గ్లింప్స్ చూస్తే తన కొడుకు కోసం ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ తనని తాను 'ల' కారంతో పిలిచే తిట్టుతో చెప్పుకుంటుంది. అదే నాని చేతిపై కూడా పచ్చబొట్టుగా కనిపిస్తుంది.
మరి నాని అలా పిలిపించుకుంటాడా అనేది ఒకెత్తు అయితే ఇపుడు రమ్యకృష్ణ కూడా అదే పదంతో పిలిపించుకుంటారా అనేది మరింత పెద్ద ప్రశ్నగా మారింది. దీనితో సినిమాలో రమ్యకృష్ణ రోల్ వేశ్య అని కన్ఫర్మ్ అనుకోవచ్చు. టైటిల్ గ్లింప్స్ తోనే మేకర్స్ సంచలనం సెట్ చేసారు. ఇక ఈ సున్నితమైన అంశాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నాని, రమ్య కృష్ణ విషయంలో ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది పెద్ద టాస్క్ గా మారింది. మరి ఆ పదంతో కొంచెం అటు ఇటు తేడా అయ్యినా కూడా పెద్ద రచ్చే జరిగే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











