రోజాకు ఇండస్ట్రీలో పరిస్థితి దారుణంగా? అవకాశాల కోసం..

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లో ప్రముఖ నటి అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజా సెల్వమణి కోసం తెలియని వారు ఉండరు. తెలుగు బిగ్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ లాంటి అగ్ర తారల సరసన హీరోయిన్ గా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమిళ సినిమా దగ్గర కూడా బాగానే రాణించి మారుతున్న కాలంతో పాటుగా తన వయసుకి తగ్గ పాత్రలు చేస్తూ సినిమా లైఫ్ ని బాగానే లీడ్ చేసింది.

మధ్యలో కొన్ని టీవీ షోస్ కూడా రోజా చేసింది. కానీ రోజా తర్వాత పాలిటిక్స్ లోకి కూడా ఎంటర్ అయ్యింది. మరి ఆమెకి సినిమా ఫేమ్ ఉన్నప్పటికీ ఈ రంగంలో మాత్రం వెంటనే విజయం రాలేదు. కానీ ఎట్టకేలకి 2019లో తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాక మాత్రం రోజాపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

Is actress roja selvamani looking for Tamil industry offer

మెయిన్ గా సినిమా ప్రముఖ హీరోస్ విషయంలో కూడా రోజా చేసిన పలు అనుచిత వ్యాఖ్యలతో రోజాపై మరింత నెగిటివ్ రావడం జరిగింది. ఆ సమయంలోనే రోజా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలా మాట్లాడుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలైతే తన పరిస్థితి ఇలా ఉంటుంది అని కూడా కొందరు ముందే ఊహించారు.

అనుకున్నట్టుగానే ఇప్పుడు ఓటమి పాలయ్యాక రోజా పరిస్థితి దారుణంగా ఉందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజాకి అయితే తెలుగులో ఎలాంటి అవకాశాలు దొరకడం లేదట, ఒక్క సినిమాల్లోనే కాకుంగా కనీసం బుల్లితెర మీద అయినా ఏమన్నా చేద్దామన్నా తెలుగులో ఆమెకి ఎలాంటి అవకాశాలు రావట్లేదు అని వినిపిస్తుంది.

దీనితో ఆమె చేసేది ఏమి లేక తన భర్త నేటివ్ ప్లేస్ తమిళనాడులో ట్రై చేస్తుందట. అక్కడ అయినా ఏవో ఒక్క టెలివిజన్ షో అయినా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందట. అయినా అక్కడ నుంచి కూడా సరైన రెస్పాన్స్ ఆమెకి లేనట్టే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలా మొత్తానికి అయితే రోజా తన కెరీర్ ని తన చేజేతులా వెనక్కి లాక్కుందని చెప్పాలి.

Is actress roja selvamani looking for Tamil industry offer

ఆమెపై అంత నెగిటివ్ రావడానికి కూడా కారణం ఎవరో కాదు ఆమె అని ఆమెకి కూడా తెలుసనీ ఇప్పటికీ చాలా మంది అంటారు. మరి మళ్ళీ రోజా కోరుకున్న ఫేమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో దొరుకుతుందో లేదో కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోజా తెలుగు స్టేట్స్ లో లేదనే టాక్. భర్తతో కలిసి చెన్నై లోనే ఆమె ఉంటున్నట్టుగా తెలుస్తుంది.

ఆ మధ్య కొందరు తనకి పేరు ఇచ్చిన జబర్దస్త్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆమె జబర్దస్త్ ఎంట్రీ ఇద్దామన్నా కూడా పీక్ స్టేజిలో తమని వదిలేసినందుకు అక్కడ కూడా రోజాకి నో ఎంట్రీ గేట్లే పడినట్టుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇలా మొత్తంగా ఎటు చూసినా కూడా రోజా పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉందని సినీ వర్గాల్లో టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X