సమంతకు ముఖం చాటేస్తున్న నిర్మాతలు.. ఆ ఇద్దరు హీరోయిన్లకే భారీ ఆఫర్లు!
బాలీవుడ్ హీరోయిన్లు, హీరోలంతా సౌత్ వైపు చూస్తుంటే, ఇప్పటిదాకా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి తహతలాడుతున్నారు. అందులో భాగంగానే వచ్చిన ఆఫర్లను వదులుకోకుండా సద్వినియోగపరుచుకుంటున్నారు. కానీ ఓ హీరోయిన్ కి మాత్రం రెండేళ్లు ట్రై చేస్తున్నా ఒక్క ఆఫర్ కూడా రాలేదు. మరి ఆ హీరోయిన్ ని కావాలనే బాలీవుడ్ దూరం పెట్టిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం భాషా భేదం అనే తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాల్లో చేయడానికి స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ నుంచి సౌత్ హీరోయిన్లకు పిలుపు వస్తోంది. ఇప్పటికే యానిమల్ మూవీతో రష్మిక మందన్న బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు మూడు బడా బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రష్మిక మందన్న అక్కడే సెటిల్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడిప్పుడే హిందీ చిత్ర పరిశ్రమలో అడుగులు వేస్తున్న సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లకు కూడా చేతిలో రెండేసి సినిమాలు ఉన్నాయి.
కీర్తి సురేష్ హిందీలో నటించిన ఫస్ట్ మూవీ మైదాన్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ ని మరో బాలివుడ్ ఆఫర్ వరించింది.
డైరెక్టర్ ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ కాంబోలో రాబోతున్న సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. కీర్తి సురేష్ సంగతి ఇలా ఉంటే మరోవైపు సాయి పల్లవి కూడా గ్లామర్ హద్దులు దాటకుండానే తన స్టైల్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే సినిమాలను పట్టేస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీత పాత్రను పోషిస్తుంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్న విషయం తెలిసింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైపోయింది.
మరోవైపు అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూట్ మూవీతో సాయి పల్లవి తన బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా మొత్తం మీద ఈ ముగ్గురు హీరోయిన్లు బాలీవుడ్ లో దూసుకెళ్తుంటే సౌత్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న సమంత మాత్రం వెనకబడిపోయింది.
గత రెండేళ్లుగా సమంత పలు బాలీవుడ్ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సక్సెస్ కాలేక పోయింది. ఇప్పటిదాకా ఒక్క వెబ్ సిరీస్ మినహా సమంత మరే ఇతర బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేయలేకపోయింది. నిజానికి ముంబైలో ఈ బ్యూటీకి గట్టిగానే పరిచయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆమెకు ఇప్పటిదాకా ఒక్క ఆఫర్ కూడా రాకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే సమంతను బీ టౌన్ కావాలనే పక్కన పెట్టేసిందా? అనే అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా బాలీవుడ్ ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు సాయి పల్లవి, కీర్తి సురేష్ పైనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఫ్రీగా ఉన్న సమంతను కాదని వీళ్ళిద్దరికీ ఆఫర్స్ ఇస్తున్నారు అక్కడి మేకర్స్.


Click it and Unblock the Notifications











