»   » హీరోయిన్ శృతి హాసన్ రహస్య వివాహం?

హీరోయిన్ శృతి హాసన్ రహస్య వివాహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ హీరోయిన్ శృతి హాసన్ ప్రేమాయణం కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాదా శృతి గురించి షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆమె తన విదేశీ ప్రియుడిని రహస్యంగా పెళ్లాడినట్లు తెలుస్తోంది.

ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్స్, డేటింగులు, సహజీవనం లాంటి విషయాల్లో.... కమల్ హాసన్ పోకడలు అందరికీ తెలిసిందే. తండ్రి మాదిరిగానే శృతి హాసన్ కూడా ఇలాంటి వ్యవహారాల్లో కాస్త దూకుడుగా ఉంటోందనే టాక్ వినిపిస్తోంది.

విదేశీయుడితో ప్రేమాయణం

విదేశీయుడితో ప్రేమాయణం

శృతి హాసన్ కొన్ని రోజులుగా లండన్ బేస్డ్ థియేటర్ ఆర్టిస్ట్ మిచేల్ కోర్సల్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అతడు ఇటీవల వచ్చి కొన్ని రోజులు శృతి హాసన్ తో గడిపి వెళ్లాడు. ఇద్దరూ ప్రస్తుతం డేటింగులో కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

రహస్య వివాహం

రహస్య వివాహం

కొన్ని రోజుల క్రితమే ఇద్దరూ ఇటలీలో రహస్య వివాహం చేసుకుందని... అందుకే శృతి హాసన్ తరచూ ఇటలీకి, ఇండియాకి ప్రయాణాలు చేస్తోందనే పుకార్లు వినిపిస్తున్నాయి.

సినిమాలు చేస్తుంది కాబట్టే సీక్రెట్ గా

సినిమాలు చేస్తుంది కాబట్టే సీక్రెట్ గా

ప్రస్తుతం శృతి హాసన్ కెరీర్ సినీ రంగంలో అంతంత మాత్రంగానే సాగుతోంది. పెళ్లయితే ఈ మాత్రం అవకాశాలు కూడా ఉండవనే ఉద్దేశ్యంతో తన మ్యారేజ్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు టాక్.

నిజం ఎంత?

నిజం ఎంత?

అయితే శృతి హాసన్ సన్నిహితులు మాత్రం ఆమె ఏం చేసినా.... ధైర్యంగా చేస్తుంది. పెళ్లికి ముందే సమజీవనానికి సైతం సిద్ధమనే స్వభావం, అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆమెకు రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి ఈ విషయంలో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

English summary
Now rumours are spreading about Shruti Haasan's marriage and many are wondering whether Shruti is already married. to London based theatre artiste Michael Corsale. She is seen spotted flying to Italy rather than attend film shoots in Chennai, Mumbai and Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu