ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి శ్రీలీలా ఔట్? షాకింగ్ న్యూస్.. కానీ
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఏర్లీ ఏజ్ లోనే హీరోయిన్ గా సక్సెస్ అందుకొని దుమ్ములేపుతోంది. స్టార్ హీరోలకు జోడీ నటించి తను కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ఈ క్రేజీ బ్యూటీ గుంటూరు కారం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీలీలా చేతిలో ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రంలో శ్రీలీలా పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతుంది.
శ్రీలీలా తెలుగు సినిమాలు..
యంగ్ హీరోయిన్ శ్రీలీలా 16 ఏళ్ల తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. టాలీవుడ్ లోకి పెళ్లిసందD అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన, డ్యాన్స్ , అందంతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను కట్టి పడేసింది. మరోవైపు తన టాలెంట్ తో దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. ఫలితంగా వరస ఆఫర్లు అందాయి. మొదట ఖిలాడీ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంది. చివరిగా రాబిన్ హుడ్ చిత్రంతో వెండితెరపై మెరిసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి శ్రీలీలా తప్పుకుందా?
పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రెండో సారి రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ పవర్ స్టార్ పొలిటికల్ ప్రొగ్రామ్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. 2022లోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కొంత మేర షూటింగ్ కూడా జరిపారు. ఆ తర్వాత హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలోనే శ్రీలీలా కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే సందేహాలు వస్తున్నాయి. వీకీపీడియా లాంటి ప్రముఖ సంస్థ శ్రీలీలా ఫిల్మోగ్రఫీలో లిస్ట్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. గతంలో ఈ ప్రాజెక్ట్ పేరు కనిపించినా ఇప్పుడు కనిపించడం లేదు.
శ్రీలీలా షూటింగ్ కు రెడీ..
మరోవైపు శ్రీలీలా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే సందేహాలను అటు ఉంచితే... జూన్ నెలలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని, మళ్లీ సెట్స్ పైకి వెళ్ళనుంని గాసిప్ వినిపిస్తోంది. ఇందుకోసం శ్రీలీలాతో చిత్రీకరించాల్సిన సీన్లకు ఆమె నుంచి భారీ మొత్తంలో డేట్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. శ్రీలీలా కూడా తన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి డేట్స్ ఇచ్చిందని అంటున్నారు. దీనిపై మున్ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తుందనేది వేచి చూడాలి.
శ్రీలీలా రాబోయే చిత్రాలు..
చివరిగా రాబిన్ హుడ్ తో ప్రేక్షకులను అలరించింది శ్రీలీలా ఈ చిత్రం తర్వాత.. నెక్ట్స్ జూనియర్, మాస్ జాతర, ఆషీకీ3, పరాశక్తి, లెనిన్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు ప్రాజెక్ట్ తో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.


Click it and Unblock the Notifications











