52 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్దమైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అది కూడా చిన్నవాడితో..
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల ప్రేమ, పెళ్లి, విడాకులు చర్చనీయమే. ఎప్పుడూ ఎవ్వరూ పెళ్లి చేసుకుంటారో.. ఎప్పుడూ ఏ జంట తమ బంధాన్ని తెంచుకుంటుందో ఎవరూ చెప్పలేరు. అయితే.. ఐదు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉన్న ఓ సెలబ్రెటీ త్వరలోనే మింగల్ కావాలని భావిస్తుందట. ఇంతకీ లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఎవరో మీరు ఓ లూక్కేయండి.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ తెలుగు హీరోయిన్ టబు (tabu). ఈ అమ్మడు గురించి తెలియని వారు ఉండరు. 90 లో టబు అంటే యూత్ పడిచచ్చిపోయేవారు. ఈ టాలీవుడ్ బ్యూటీ వెండి తెరపై కనిపిస్తే చాలు.. అప్పట్లో థియేటర్‌లో కుర్రాళ్లు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవాళ్లు. ఆ రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకుంది. ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ అందం తగ్గలేదు. ఆమె పాపులార్టీ తగ్గలేదు. అలాంటి తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది బ్యూటీ టబు..

సీనియర్ హీరోయిన్ టబు వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నెం.1 సినిమాతో తెలుగులో నటించే ఛాన్స్ కొట్టేసింది. తొలి మూవీ హిట్ కావడంతో ఈ అమ్మడు తిరుగులేని క్రేజ్ సంపాదించకుంది. ఆ తర్వాత హీరోయిన్ టబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన నటనతో అందరికీ మిస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వరుసగా.. నిన్నే పెళ్ళాడుతా.., ఆవిడ మా ఆవిడ వంటి సినిమాల్లో అక్కినేని నాగార్జునకు జోడిగా నటించింది. ఈ మూవీ తర్వాత వీరి మధ్య మంచి చనువు ఏర్పడిందని గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించారట. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల నాగార్జునతో పెళ్లి జరగలేదని, వీరిద్దరి మధ్య అనేక రూమర్స్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా టబూ బాలయ్య బాబుతో కూడా నటించింది. చెన్నకేశవరెడ్డి, పాండురంగడు వంటి మూవీస్ లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిన అలవైకుంఠపురంలో నటించారు టాబూ. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తల్లి పాత్రలో కనిపించారు.
అదేవిధంగా అనేక హిందీ సినిమాల్లో కూడా నటించారు. దృశ్యం2, నూటబల్ బాయ్ వంటి సినిమాల్లో నటించారు. అంతేకాకుండా టాబు ఎక్కువగా రొమాంటిక్ రోల్స్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో రొమాన్స్ సీన్స్ లో నటించడంపై బోల్డ్ కామెంట్ చేశారు. రొమాన్స్ కు ఏజ్ తో సంబంధం లేదని, సినిమాల్లో అలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తే.. తాను కచ్చితంగా చేసేందుకు కూడా రెడీ అన్నట్టు చెప్పారు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ గా టాబు ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఈ సీనియర్ హీరోయిన్ 52 ఏండ్లు వచ్చినా.. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే గతంలో టాలీవుడ్ లో నాగార్జునతో, బాలీవుడ్ లో హీరో అజయ్ దేవగన్ లతో లవర్ ఎఫైర్ కొనసాగినట్టు అప్పట్లో వార్తలు జోరుగా వచ్చాయి. అయితే.. ఈ లవ్ ట్రక్ ఫెయిల్ కావడంతో ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదని టాక్.
అయితే.. తాజాగా ఈ 52 ఏండ్ల బ్యూటీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వార్తలు ఉన్నారని, ఆమె కంటే వయసులో చిన్నవాడితో ప్రేమలో ఉన్నారనీ, తొందరగానే వీరు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై ఆ హీరోయిన్ నుంచి గానీ, ఇండస్ట్రీ పెద్దల నుంచి గానీ ఎలాంటిఅధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ వార్తల్లో ఎంత నిజముందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











