బాలయ్య చేసే ఆ.. సినిమా హాలీవుడ్ రీమేకా?
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అలాంటి సినిమా రావడం అనేది ఓ వండర్. బాలయ్య కెరీర్లోనే చెప్పుకోదగ్గ గొప్ప సినిమా నిలిచిందాసినిమా. తాజా ఆ చిత్రానికి స్వీక్వెల్ రూపొందించే ప్రయత్నం జరుగుతున్న సంగతి తెలిసిందే.
'ఆదిత్య 999' పేరుతో రూపొందుతున్న ఈచిత్రానికి సింగితం శ్రీనివాస రావు దర్శకత్వం వహించనున్నారు. కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
కాగా ఈచిత్రంపై ఇప్పుడొక కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈచిత్రం ఓ హాలీవుడ్ చిత్రానికి సీక్వెల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలయ్య నటించిన 'ఆదిత్య 369' చిత్రం 'బ్యాక్ టు ద ఫ్యూచర్' అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా రూపొందించారని....తాజాగా రూపొందబోతున్న 'ఆదిత్య 999' చిత్రం కూడా 'బ్యాక్ టు ద ఫ్యూచర్'కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ఆధారంగానే రూపొందిస్తున్నరని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది.
ప్రస్తుతం బాలకృష్ణ రవి చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలు నటిస్తున్నారు. మరో వైపు బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రం జూన్ 1న విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటీకి వసూళ్లు మాత్రం ఆశాజనకంగానే సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











