అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య రాయ్ విడిపోయిందా?.. అనంత్ అంబానీ పెళ్లిలో బయటపడ్డ నిజం ఇదే!
ప్రస్తుతం దేశం అంతా గట్టిగా మాట్లాడుకుంటున్న పెళ్లి ఏదన్నా ఉంది అంటే అది భారతదేశ అపర కుబేరుడు అనీల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసమే అని చెప్పాలి. వేల కోట్ల ఖర్చుతో ముంబై నగర వీధుల్లో ఓ రేంజ్ లో ఈ పెళ్లి జరుగుతుంది. కాగా అంబానీ ఈ పెళ్ళికి గాను అనేక మంది పాపులర్ నటీనటులతో తన వెడ్డింగ్ వేదిక మొత్తాన్ని నింపేయగా పాన్ ఇండియా సినీ ప్రముఖులు అంతా కూడా తమ కుటుంబాలతో హాజరయ్యారు.
టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్ తదితర బిగ్ స్టార్స్ హాజరు అయితే తమిళ్ నుంచి కోలీవుడ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్,బాలీవుడ్ నుంచి షారుఖ్, అనన్య పాండే ఇంకా పలు బిగ్ స్టార్స్ ఇక్కడే కనిపించారు కాగా ఇదే పెళ్ళికి బాలీవుడ్ దిగ్గజ నటుడు ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ "కల్కి 2898 ఎడి" తో అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యారు. కాగా ఇప్పుడు ఈ పెళ్ళిలో అమితాబ్ కుటుంబ కలహాలు బాలీవుడ్ మీడియాలో సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.

మరి అనేకమంది స్టార్ లు తమ ఫ్యామిలీస్ తో వచ్చారు కానీ బచ్చన్ కుటుంబం మాత్రం వేరేగా వచ్చింది. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకోవడం వారికి పిల్లలు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఐశ్వర్య సినిమాలు తగ్గించేసాక బచ్చన్ ఫ్యామిలీ తోనే కలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు పెళ్లిలో మాత్రం వేరేగా కనిపించడం అనేది అందరిలో షాకింగ్ గా మారింది.
అక్కడ వేడుకల్లో ఎంతో మంది ఉంటే అందులో అమితాబ్ దంపతులు అలాగే అభిషేక్ బచ్చన్ కూడా అమితాబ్ తోనే కలిసి కనిపించాడు కానీ వీరి కుటుంబంతో ఐశ్వర్య రావ్ ఎక్కడా కలిసి కనిపించలేదు. పైగా తన కూతరు ఆరాధ్యతో కలిసి ఐష్ వేరేగా వచ్చి అదే పెళ్ళిలో కనిపించింది. దీనితో ఒకే కుటుంబం అయ్యిన వీరు ఇప్పుడు ఇలా విడి విడిగా రావడం అనేది అనేక అనుమానాలకు తావు తీస్తుంది.

మరి నిజంగా వీరి కుటుంబంలో కలహాలు ఏమన్నా ఉన్నాయా లేక వారు ముందు వచ్చి ఈమె ఆలస్యం అయ్యిందా అనే కోణాలు కూడా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎంత లేట్ అయినా కూడా ఇలాంటి పెద్ద కుటుంబం నుంచి విడిగా రావడం అంటే అనుమానించాల్సిందే అని కొందరు అంటున్నారు. మరి ఫ్యూచర్ లో ఏమన్నా ఈ హాట్ టాపిక్ కి సమాధానం దొరుకుంటుందేమో వేచి చూడాలి. కాగా ఈ ఉదయమే అమితాబ్ సోషల్ మీడియాలో కల్కి 2898 ఎడి సక్సెస్ కి గాను వరుస పోస్టులు వేస్తూ టాలీవుడ్ ఫ్యాన్స్ కి షాకిచ్చారు. మరి భారీ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్ లు కూడా కనిపించగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











