తండ్రి వయసున్న హీరోతో రొమాన్స్... యువ నటి షాకింగ్ నిర్ణయం -
ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగు సినిమాలు కూడా చేస్తోంది.. అయితే తాజాగా ఐశ్వర్య తన తండ్రి వయసు ఉన్న స్టార్ హీరోతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త వైరల్ అవుతుంది. మరి ఐశ్వర్య ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందో తెలుసుకుందాం పదండి.
ఐశ్వర్య రాజేష్ తెలుగులో టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీ తమిళ నటి అయినప్పటికీ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులలో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డ ఐశ్వర్య ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది.

ముందుగా బుల్లితెరపై యాంకర్ గా కాలు పెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య రాజేష్ కు తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తాజాగా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వెంకీ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
ఈ ఏడాది జనవరిలో సైంధవ్ మూవీతో డిజాస్టర్ అందుకున్న వెంకటేష్ మరోసారి డైరెక్టర్ అనిల్ రావిపూడినే నమ్ముకుంటున్నాడు. వెంకీ సోలో హీరోగా అనిల్ రావిపూడి కమిట్ అయిన ఈ మూవీకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ఖరారు చేసి కొన్ని రోజుల క్రితమే అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుండగా ప్రస్తుతం నటీనటుల సెలెక్షన్ జరుగుతుంది.

కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్టు మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి రూమర్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యనే టెస్ట్ లుక్ చేయగా, ఆమె వెంకీ సరసన కరెక్ట్ గా సెట్ అయ్యిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఉందని, ఆమె మిలటరీ ఆఫీసర్ గా నటించబోతుందని అంటున్నారు.
ఇక ఈ మూవీని నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని అనిల్ రావుకుడి, నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య తన తండ్రి వయసున్న వెంకీ మామతో రొమాన్స్ కు రెడీ కావడం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటూనే, లేడి ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ అమ్మడు వెంకీ సినిమాలో ఆయన భార్యగా నటించడం తమిళ తమ్ముళ్లకు షాక్ ఇస్తోంది. కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది మామూలే.


Click it and Unblock the Notifications











