KGF Chapter 3 : అగ్ర హీరోతో KGF 3? ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్, మరీ యష్?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ యష్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ మూవీ కేజీఎఫ్ గురించి అందరికీ తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఎస్ ఎస్ రాజమౌళి వంటి దర్శక ధీరులకే షాక్ ఇచ్చేలా ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కేజీఎఫ్ ఛాప్టర్ 1 చిత్రంతో బాక్సాఫీస్ వద్ద 250 కోట్లు కొల్లగొట్టారు. అంతేకాదు తన డైరెక్షన్ తోను ప్రశాంత్ నీల్ ఇండియా వైడ్ గా స్టార్ డమ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులను డీల్ చేస్తున్నారు.

2018లో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 తర్వాత నాలుగేళ్లకు 2022 ఏప్రిల్ 14న కేజీఎఫ్ ఛాప్టర్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా సత్తాను చాటింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1240 కోట్లు గ్రాస్ వసూలు చేసి సంచలనంగా మారింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మొదటి 500 కోట్ల సినిమాగా, మొదటి 1000 కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో 8వ స్థానాన్ని దక్కించుకుంది.

Is Ajith Kumar in KFG Chapter 3

కేజీఎఫ్ ఛాప్టర్ 2 భారీ బ్లాక్ బస్టర్ కావడంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3 పై ప్రేక్షకులకు మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. అసలు కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం యష్ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న గ్యాంగ్ స్టార్ ఫిలిం టాక్సిక్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే కేజీఎఫ్ ఛాప్టర్ 3 లో యష్ ఉంటారా లేరా అనేది సందిగ్ధంగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం అగ్ర హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది.

కేజీఎఫ్ ఛాప్టర్ 3 ప్రారంభానికి ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. 2025 లోనే కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రశాంత్ నీల్ కు ఉన్న కమిట్మెంట్స్ తో ఈ ప్రాజెక్ట్ ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో లేదంటే 2026 లో సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే కేజీఎఫ్ ఛాప్టర్ 3లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఉండబోతున్నారని టాక్ నడుస్తోంది. అజిత్ కుమార్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఒకరు కేజీఎఫ్ ఛాప్టర్ 3 లో తమ హీరో ఫిక్స్ అయ్యారని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

దీంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3 లో యష్ ఉంటారా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, మరోవైపు యష్ తో పాటు అజిత్ కుమార్ ను కూడా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేస్తారని అంటున్నారు. యాక్షన్ సినిమాలకు ఎంతగానో ప్రియారిటీ ఇచ్చే అజిత్ కుమార్ కేజీఎఫ్ ఛాప్టర్ 3కి మాత్రం ఎంట్రీ ఇస్తే ఆయనకున్న ఫ్యాన్ బేస్ కు, మార్కెట్ కు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని అభిమానులు ఇప్పటినుంచే అంచనాలను పెంచుతున్నారు.

ఇక ప్రస్తుతం అజిత్ కుమార్ తన లేటెస్ట్ చిత్రం గుడ్ బాడ్ అగ్లీ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 31 (డ్రాగన్) చిత్రాన్ని శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కావడం విశేషం. ఈ నెలలోనే ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ 2 చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడంలోనూ బాకీ ఉన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X