అఖిల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్? ఏర్పాట్లలో అక్కినేని ఫ్యామిలీ బిజీ.. వేదిక ఎక్కడంటే?

ప్రస్తుతం ఇండియాలో సెలబ్రెటీలు తమ వివాహ వార్తలు, ప్రెగ్నెన్సీ న్యూస్‌తో అభిమానుకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. బ్రేకప్స్, విడాకుల న్యూస్‌ చాటున ఈ శుభవార్తలు చిత్ర పరిశ్రమకు కాస్తంత ఊరట కలిగిస్తున్నాయి. కొందరు తమ బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు పలికి పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆరు నెలల క్రితం నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. తాజాగా నాగ్ చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి కూడా ఖాయమైంది. ఆయన వివాహానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే.

అక్కినేని నాగార్జునకు రెండు పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే. మూవీ మొఘల్ డాక్టర్ డీ.రామానాయుడు కుమార్తె లక్ష్మీని ఆయన తొలుత పెళ్లాడారు. ఈ దంపతులకు నాగచైతన్య సంతానం. అయితే మనస్పర్ధలు, ఇతర వ్యక్తిగత కారణాలతో నాగ్- లక్ష్మీలు విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ దశలో తన సహ నటి అమలతో ప్రేమలో పడిన నాగార్జున పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లాడారు. ఈ దంపతులకు అఖిల్ సంతానం. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికాలలో చదువుకున్న నాగచైతన్య సినిమాలపై ఆసక్తితో 16 ఏళ్ల వయసులోనే న్యూయార్క్‌లో శిక్షణ తీసుకున్నారు.

is Akhil Akkineni and Zainab Ravdjee Marriage Date Fixed more details about Nagarjuna s son wedding

హీరోగా నిలదొక్కుకుంటోన్న అఖిల్

1995లో రెండేళ్ల వయసులోనే అఖిల్ తన తండ్రితో కలిసి సిసింద్రీలో నటించారు. 2014లో అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన మనంలో గెస్ట్ రోల్ పోషించారు. అనంతరం 2015లో వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు తొలి సినిమానే షాకిచ్చింది. ఆ తర్వాత హాలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాల్లో నటించారు. వీటిలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌తో హిట్ అందుకున్నారు. కెరీర్‌ను హిట్ ట్రాక్‌లోకి ఎక్కించడానికి ఆయన కష్టపడుతున్నారు. ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో అఖిల్ నటిస్తున్నారు.

శ్రేయా భూపాల్‌తో రద్దైన అఖిల్ పెళ్లి

ఇదిలాఉండగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్‌తో ప్రేమలో పడ్డ అఖిల్ పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లాడాలని అనుకున్నాడు. 2016 డిసెంబర్ 9న వీరిద్దరికీ ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే అనూహ్య కారణాలతో వీరి వివాహం రద్దు కావడంతో అక్కినేని అభిమానులు, సినీ పరిశ్రమ షాకైంది. ఆ తర్వాత కెరీర్‌పై ఫోకస్ పెట్టిన అఖిల్ తాజాగా ముంబైకి చెందిన జైనాబ్ రవ్జీతో ప్రేమలో పడ్డారు. ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ పెద్ద వ్యాపారవేత్త .. హైదరాబాద్‌లోనే పుట్టిన జైనాబ్.. ముంబైలో స్థిరపడింది. ముంబై, దుబాయ్, లండన్‌లో ఆమె చదువుకున్నారు. ఈమెలో మంచి పెయింటర్ కూడా ఉంది. నటిగానూ ఎంట్రీ ఇచ్చింది.

జైనాబ్‌తో ప్రేమలో పడ్డ అఖిల్

కొద్దినెలల క్రితం ఓ కార్యక్రమంలో అఖిల్ - జైనాబ్ కలుసుకోగా వీరి పరిచయం, ప్రేమగా మారింది. గుట్టుగా తమ ప్రేమాయాణాన్ని సాగించిన వీరిద్దరూ గతేడాది పెద్దల అంగీకారంతో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. ఆ సమయంలో నాగచైతన్య - శోభితల వివాహానికి ఏర్పాట్లు జరగడంతో కొద్దినెలల తర్వాత అఖిల్ - జైనాబ్‌ల పెళ్లిని కొద్దినెలలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ఎప్పుడు? వేదిక ఎక్కడ? ఇండియాలో చేసుకుంటారా? డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. తాజాగా అఖిల్ పెళ్లిపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం జూన్ 6న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్ అక్కినేని - జైనాబ్ రవ్జీల వివాహం జరగనుందట. అయితే దీనిపై అక్కినేని, జైనాబ్ కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X