అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశ?..‘లెనిన్'కు కొత్త కష్టాలు!

టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరో అఖిల్ అక్కినేని. ఈసారి 'లెనిన్' (Lenin)అనే పవర్‌ఫుల్ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. చాలా కాలంగా సరైన బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా గేమ్ ఛేంజర్ అవుతుందని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ విలేజ్ డ్రామాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా కథ కంటే ప్రస్తుతం దాని విడుదల తేదీ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రిలీజ్ డేట్‌పై కొత్త సందిగ్ధం నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

'లెనిన్'సినిమాకు మురళీకిషోర్ దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మనం ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పిస్తుండగా, సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాఅఖిల్ కెరీర్‌కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారడంతో, విడుదల తేదీపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

Is Akhil Akkineni s Lenin Release Delayed Again Fresh Concerns Leave Fans Disappointed

నిజానికి 'లెనిన్' సినిమాను మొదట మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో భారీ అంచనాల మధ్య రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా విడుదలకు సిద్ధమవడంతో, పోటీని నివారించేందుకు 'లెనిన్'ను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆసక్తికరంగా ఆ తర్వాత 'పెద్ది' కూడా తన విడుదల తేదీని మార్చుకోవడంతో, 'లెనిన్'కు కొత్త రిలీజ్ డేట్‌గా జూన్ 26ను ఫిక్స్ చేశారు. ఈ తేదీని స్వయంగా అక్కినేని నాగార్జున ప్రకటించడంతో అభిమానులు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌లోకి వచ్చారు.

అయితే ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారినట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలకమైన విజువల్ వర్క్స్, ఎడిటింగ్, ఫైనల్ అవుట్‌పుట్‌కు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. దీంతో జూన్ 26 నాటికి సినిమా పూర్తిస్థాయిలో సిద్ధం కావడం కష్టమనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా సినిమాను జూలై మొదటి వారానికి వాయిదా వేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ వార్తలు అఖిల్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా విషయంలో మరోసారి అదే పరిస్థితి రావడం వారిని నిరాశకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా "రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వండి" అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా మూవీమేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో, ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ కేవలం ప్రచారాలుగానే భావించాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X