బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ రికార్డు రెమ్యునరేషన్ .. ఎన్టీఆర్‌కు మించి.. ఎంత తీసుకొంటున్నారో తెలుసా?

Recommended Video

Bigg Boss Telugu 3 : Nagarjuna's Remuneration For Bigg Boss Telugu 3 || Filmibeat Telugu

బిగ్‌బాస్ సీజన్ 3కి ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. త్వరలోనే ఇంటిలోకి సెలబ్రిటీలను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు పూర్తి కాగానే బిగ్‌బాస్‌ను మొదలుపెట్టేందుకు నిర్వాహకులు సిద్దంగా ఉన్నారు. అయితే బిగ్‌బాస్ ప్రారంభానికి ముందే అనేక రకమైన వార్తలు, ఊహాగానాలతో ఈ షో ఆసక్తిని రేపుతున్నది. తాజాగా మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెమ్యునరేషన్ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ షోకు ఎంత తీసుకొనున్నారంటే...

 నాగార్జునకు భారీగా రెమ్యునరేషన్

నాగార్జునకు భారీగా రెమ్యునరేషన్

బిగ్‌బాస్ సీజన్ 3 జూలై 21 ఆదివారం ప్రసారం కాబోతున్నది. వివాదాస్పద రియాలిటీ షో కోసం స్టార్ మా భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెపుతున్నట్టు సమాచారం. తొలుత ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడానికి నాగ్ విముఖత చూపించినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్ కారణంగా ఒప్పుకొన్నట్టు సమాచారం. తెలుగు టెలివిజన్ రంగంలో ఇంత రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకొనే హీరో నాగ్ అనే టాక్ నడుస్తున్నది.

 ప్రతీ ఎపిసోడ్‌కు ఎంత తీసుకొంటున్నారంటే

ప్రతీ ఎపిసోడ్‌కు ఎంత తీసుకొంటున్నారంటే

గతంలో హిందీలో క్రేజీగా నడిచే కౌన్ బనేగా కరోడ్‌పతి తెలుగు వెర్షన్‌కు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రతీ ఎపిసోడ్‌కు రూ.7 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఇక బిగ్‌బాస్ 3 సీజన్‌‌ కోసం ప్రతీ ఎపిసోడ్‌కు రూ.12 లక్షల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ప్రతీ రోజు గంట సేపు సాగే ఎపిసోడ్‌కు ఈ మొత్తంలో రెమ్యునరేషన్ అంటే భారీగానే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 బిగ్‌బాస్ కోసం 12 కోట్ల రెమ్యునరేషన్

బిగ్‌బాస్ కోసం 12 కోట్ల రెమ్యునరేషన్

బిగ్‌బాస్ 3 సీజన్ దాదాపు 100 ఎపిసోడ్స్ ప్రసారం అవుతుంది. అంటే నాగార్జునకు మొత్తం సీజన్ 3 కోసం సుమారు రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనే అవకాశం ఉంది. తెలుగు హీరోలకు సంబంధించి ఇది భారీ రెమ్యునరేషనే అని మాట వ్యక్తమవుతున్నది. అయితే బిగ్‌బాస్‌ను నాగ్ ఎలా ముందుకు తీసుకెళ్తాడో అనే విషయంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 జూ ఎన్టీఆర్‌కు 10 లక్షలు మాత్రమే

జూ ఎన్టీఆర్‌కు 10 లక్షలు మాత్రమే

గతంలో బిగ్‌బాస్ సీజన్ 3 కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా భారీగానే చెల్లించారు. ఆయనకు సుమారు రూ.10 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అప్పట్లో ఓ టెలివిజన్ హోస్ట్‌కు అంత రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇవ్వడం అదే రికార్డు. తాజాగా ఎన్టీఆర్‌ను నాగ్ అధిగమించి.. రికార్డు స్థాయి రెమ్యునరేషన్‌ను తీసుకొంటున్నాడనే విషయం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 14 సభ్యులతో 100 రోజులు

14 సభ్యులతో 100 రోజులు

ఇక బిగ్‌బాస్ సీజన్ 3లో 14 మంది ఇంటి సభ్యులు ఉండే అవకాశం ఉంది. గతంలో ఈ షో 15 మందితో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సారి ఒకరిని తగ్గించి 14 సభ్యులకే పరిమితం అయినట్టు సమాచారం. జూలై 21 మొదలయ్యే ఈ షో ఏకధాటిగా 100 రోజులు సాగుతుంది. ఇప్పటికే తమిళ బిగ్‌బాస్ ప్రారంభమై మూడో వారాన్ని ఘనంగా ప్రారంభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X