Devara: దేవరలో బాలీవుడ్ టాప్ హీరోయిన్? జూ ఎన్టీఆర్‌తో జాన్వీ, నోరా ఫతేహితోపాటు ఆమె కూడానా!
ఇప్పుడు ఇండియా మొత్తం అత్యధికంగా వినిపిస్తున్న సినిమా పేరు ఏదన్నా ఉంది అంటే అది టాలీవుడ్ సినిమాలో మంచి మాస్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తన తొలి పాన్ ఇండియా చిత్రం "దేవర" కోసమే అని చెప్పాలి. గత కొన్ని నెలలు కితం పాన్ ఇండియా సినిమాని రెబల్ స్టార్ ప్రభాస్ తన భారీ చిత్రం "కల్కి 2898 ఎడి" రిలీజ్ అయ్యి అదరగొట్టింది.
ప్రభాస్ కెరీర్ లోనే పెద్ద గ్రాసర్ గా నిలిచి తెలుగు సినిమా సత్తా చాటి చెప్పింది. ఇక ఇలాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా నుంచి అది కూడా ఓ బిగ్ స్టార్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రమే ఈ "దేవర". దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ రెండో కలయిక ఇది కాగా ఈ చిత్రంపై కూడా గట్టి అంచనాలే ఇప్పుడు ఉన్నాయి.

అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి అంత మంచి రెస్పాన్స్ రాలేదు కానీ ఎన్టీఆర్ అండ్ టీం మాత్రం పాన్ ఇండియా ఆడియెన్స్ కి రీచ్ అయ్యే విధంగా భారీ ప్లానింగ్ లు చేసుకుంటున్నారు. ఇలా చేసిన ప్లానింగ్ లో భాగమే సినిమాలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ అలాగే నటుడు సైఫ్ అలీ ఖాన్ లని పెట్టడం అని కూడా చెప్పాలి. కాగా ఈ ఇద్దరు కాకుండా బాలీవుడ్ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు మరిన్ని ఎలిమెంట్స్ ని సెట్ చేసినట్టుగా కూడా రూమర్స్ వచ్చాయి.
అలా బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహితో ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని అలాగే బాలీవుడ్ హైపర్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ సినిమాలో ఉంది అంటూ పలు రూమర్స్ బయటకి వచ్చాయి. కాగా ఆలియా ఎన్టీఆర్ తో తమ గత చిత్రం RRR లో స్క్రీన్ ని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే RRR లో ఇద్దరూ జోడిగా కాకుండా నటించారు.

ఇక ఆ సినిమా తర్వాత కూడా ఇద్దరూ ఒకరితో ఒకరు నటించేందుకు బాగానే ఆసక్తి చూపించారు. కానీ ఎప్పుడు ఏంటి అనేది రివీల్ కాలేదు. దీనితో దేవర లోనే ఆలియా ఓ సాలిడ్ క్యామియో రోల్ చేసింది అంటూ పలు గాసిప్స్ ఆ మధ్య అంతా వినిపించాయి. అయితే ఇప్పుడు దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ కోసం తాను కూడా భాగం అయ్యిన ఆలియా అసలు విషయాన్ని రివీల్ చేసేసింది.
తాను దేవర లో నటించలేదు అని ఎలాంటి క్యామియో కూడా చేయలేదు అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దేవరలో ఆలియా ఉందన్న వార్తల్లో నిజం లేదని ఇపుడు తేలిపోయింది. కాగా భవిష్యత్తులో ఏమన్నా వీరి కాంబినేషన్ లో సినిమా పడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ ఇద్దరూ వేరే వేరేగా బాలీవుడ్ స్పై యాక్షన్ యూనివర్స్ సినిమాల్లో నటిస్తున్నారు. మరి అలా ఏమన్నా వీరి జంట కుదురుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











