Alia Bhatt చూపు టాలీవుడ్‌పై.. మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్?

టాలీవుడ్ అంటే ఒకప్పుడు ప్రాంతీయ సినిమా. కానీ, ఇప్పుడు ఆ హద్దులను చెరిపేసుకుని దేశవ్యాప్తంగా తన రెక్కలను విస్తరిస్తోంది. గతంలో తెలుగు సినిమాను చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు అక్కున చేర్చుకుంటున్నారు. బాహుబలి, సాహో, పుష్ప వంటి సినిమాలు హిందీ చిత్ర సీమలో ఘనవిజయాలు అందుకున్నాయి. త్వరలో మరిన్ని తెలుగు సినిమాలు హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర తారలు కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Recommended Video

Alia Bhatt About Jr.NTR During RRR | Gangubai Kathiawadi | Part 2 | Filmibeat Telugu
టాలీవుడ్‌పై ఆలియా ఫోకస్

టాలీవుడ్‌పై ఆలియా ఫోకస్

అద్భుత నటనతో, గ్లామర్ ప్రదర్శనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలియా భట్ త్వరలో ఆర్ఆర్ఆర్తో తెలుగు తెర అరంగేట్రం చేయబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్లో ఆలియా సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం తనను సంప్రదించారని, చర్చలు జరుగుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆలియా స్వయంగా చెప్పింది.

రాజమౌళి-మహేష్ సినిమాలో ఛాన్స్

రాజమౌళి-మహేష్ సినిమాలో ఛాన్స్

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఆలియా భట్‌ జత కట్టనుందనే టాక్‌ తాజాగా వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌‌గా ఆలియా పేరును కూడా రాజమౌళి పరిశీలిస్తున్నట్టు టాక్. మహేశ్, ఆలియా జోడీ బాగుంటుందని రాజమౌళి అనుకుంటున్నారట. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కబోతోంది. మహేష్ సరసన ఛాన్స్ దక్కితే ఆలియా మరో మెట్టు ఎక్కినట్టే.

హాలీవుడ్‌లో బంపరాఫర్

హాలీవుడ్‌లో బంపరాఫర్

ఇటీవల గంగూభాయ్ క‌ఠియావాడీ సినిమాలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్న ఆలియా త్వరలో హాలీవుడ్‌లో కూడా మెరవబోతోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న హార్ట్ ఆఫ్ స్టోన్ అనే థ్రిల్ల‌ర్‌లో ఆలియా న‌టించ‌బోతోంది. హాలీవుడ్ స్టార్, వండర్ వుమెన్ గాల్ గ్యాడ‌ట్‌తో పాటు ఆలియా కూడా ఆ సినిమాలో కనిపించనున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఆ సినిమాలో గ్యాడట్‌తో పాటు ఆలియా యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించబోతోందట.

చుక్కల్లో పారితోషికం

చుక్కల్లో పారితోషికం

ఆలియా ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందట. ఆర్ఆర్ఆర్లో చేసినందుకు కూడా ఆలియా అంతే రెమ్యునరేషన్ అందుకుందట. ఇకపై దక్షిణాదిలో చేసే చిత్రాలకు మరింత ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయబోతోందట. సినిమాలు మాత్రమే కాకుండా వాణిజ్య ప్రకటనలతో కూడా ఆలియా చాలా బిజీగా ఉంది. పలు సంస్థలకు ఆలియా బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోంది. ఒక్కో కమర్షియల్ యాడ్‌లో నటించినందుకు ఆలియా రూ.3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందట..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X