SS Rajamouli మూవీలో మళ్లీ ఆలియాభట్.. మహేష్ బాబుతో కలిసి రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్!
RRR భారీ విజయం తర్వాత తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ రూపొందించేందుకు SS రాజమౌళి సిద్దం అవుతున్నారు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి ఈ సినిమా తెరకెక్కించేందకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా ఆలియాభట్ నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ వార్త నిజమేనా? మహేష్ బాబుతో ఎలాంటి సినిమా తీయబోతున్నారంటే..

జపాన్‌లో RRR మూవీ రిలీజ్
ఇక ఎస్ఎస్ రాజమౌళి ఇంకా RRR మూవీని ప్రపంచ సినీ ప్రేక్షకులకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. జపాన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్‌తో కలిసి రాజమౌళి జపాన్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మహేష్ బాబుతో సినిమా ఎప్పడంటే?
ప్రస్తుతం రాజమౌళి టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో బిజీగా ఉన్నారు. టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు. RRR తర్వాత తన సినిమా మహేష్ బాబుతో ఉంటుంది. ఆ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లలో గానీ.. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

మహేష్ బాబుతో మూవీ కథ ఏమిటంటే?
టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో మహేష్ బాబుతో సినిమా గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో సాగే సాహసయాత్రగా సినిమా ఉంటుంది. ఈ మూవీ globetrotting action adventure సినిమా అని రాజమౌళి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా తెరకెక్కనున్నది.
మహేష్ బాబుతో ఆలియా భట్
అయితే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఆలియాభట్ హీరోయిన్‌గా నటిస్తున్నది. రాజమౌళి సినిమా కోసం ఆలియాభట్ ఒప్పేసుకొన్నది. కాంట్రాక్టు కూడా జరిగింది. ప్రస్తుతం అలియాభట్ గర్బవతి. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగుకు హాజరవుతుంది అని దుబాయ్‌కు చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

త్రివిక్రమ్‌తో మహేష్ బిజీ
ఇదిలా ఉండగా, సర్కారు వారీ పాట మూవీ తర్వాత మహేష్ బాబు తన 28వ సినిమాను మొదలుపెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక, హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











